New Syllabus in degree: డిగ్రీ కోర్సుల్లో పలు సబ్జెక్టుల్లో ఉన్నత విద్యామండలి సిలబస్ ను మారుస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ కు అనుగుణంగా ఈ మార్పులు చేపడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే పదాలను ఇందులో వినియోగిస్తున్నారు. కాగా తాజాగా ఇంగ్లిష్(English) సబ్జెక్టులో సైతం సిలబస్ ను మార్చాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. పాత సిలబస్(Old syllabus) ను మార్చి కొత్త సిలబస్ ను అప్ డేట్ చేయనుంది. కాగా ఇంగ్లిష్ ను కఠినంగా భావించే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పదాలను చేర్చి మరింత సరళీకృతం చేయాలని నిర్ణయించింది. మార్చిన సిలబస్ ను ఈ విద్యాసంవత్సరం నుంచే ఉన్నత విద్యామండలి అమలు చేయనుంది. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication skills)పెంచుకునేందుకు కూడా ఇది దోహదపడనుంది.
మెటీరియల్ తో పాటు వర్క్ బుక్
గతంలో కష్టంగా అనిపించే ఇంగ్లిష్(English) సబ్జెక్ట్ ఇక నుంచి సలువుగా నేర్చుకోవచ్చని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే సిలబస్ లో స్కిల్ బేస్డ్ అండ్ ఈజీగా అర్థమయ్యే భాషలో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు లర్నింగ్ మెటీరియల్ తో పాటు వర్క్ బుక్ ను సైతం అదించనున్నారు. దీనికితోడు సబ్జెక్టు ఎక్స్ పర్ట్ ఆడియోనూ సైతం అందించనున్నారు. ఇదిలా ఉండగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గైడ్ లైన్స్ కు అనుగుణంగా డిగ్రీ సిలబస్ లో మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టులో నిపుణులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్లు ఈ సిలబస్ ను రూపొందించినట్లు చెబుతున్నారు. కాగా ఇప్పటికే డిగ్రీలో నాలుగు సెమిస్టర్ల సిలబస్ ను రెడీ చేసి యూనివర్సిటీలకు సైతం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పంపించినట్లు తెలిసింది.
Also Read: Watch Video: క్లాస్ రూమ్‌లో విషాదం.. ఫ్రెండ్స్ కళ్లెదుటే మరణించిన విద్యార్థి.. వీడియో వైరల్!
టీశాట్ ద్వారా టీచర్లకు
ఇంగ్లిష్ కొత్త సిలబస్‌లో తెలంగాణ హిస్టరీని పొందుపరిచారు. ఇందులోని ఇంగ్లిష్ కు లోకల్ ఫ్లేవర్ సైతం యాడ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాడుక భాషలో అర్థవంతమైన పదాలను వినియోగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు చదువుకునేందుకు పీడీఎఫ్ మెటీరియల్ ను సైతం అందించనున్నారు. ఇదిలా ఉండగా టీశాట్ ద్వారా టీచర్లకు ఓరియంటెషన్ క్లాసులనూ ఇప్పించేలా ప్లాన్ చేశారు. వారికి ఉపయోగపడేలా స్పెషల్ హ్యాండ్ బుక్ కూడా ఇవ్వనున్నారు. విద్యను ప్రతి ఇంటికీ అందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయాత్మక మార్పులు చేపడుతున్నట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల్లో కూడా ఉపయోగపడేలా కొత్త సిలబస్ ను రూపొందించారు. ఈ నిర్ణయాత్మక మార్పు ఎంతమేరకు సక్సెస్ అవుతుందనేది చూడాల్సిందే.
Also Read: BJP MLAs Arguments: అసెంబ్లీలో గొడవ పడ్డ అధికార ఎమ్మెల్యేలు.. నచ్చజెప్పిన విపక్ష సభ్యులు!