Saheli NGO(image credit:X)
నార్త్ తెలంగాణ

Saheli NGO: మహిళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మిషన్‌లో రూ.5 కాయిన్‌ వేస్తే శానిటరీ నాప్కిన్

Saheli NGO: సహేలి స్త్రీలకు స్నేహశీలి.. మహిళ మాత్రమే మహిళల ఇబ్బందుల్ని పసిగడుతుంది. ఆపద సమయంలో ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందిస్తుంది. శారీరక రుగ్మతల నేపథ్యంలో వివిధ రకాల ప్రయాణాల సమయంలో నెలసరితో మహిళలు అధిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి ఇబ్బందుల్ని గుర్తించిన ప్రముఖ న్యాయవాది (Lawyer) కొమ్ము అనుపమ “సహేలి” ఎన్జీవోస్ స్వచ్ఛంద సంస్థ స్థాపించింది. అనతి కాలంలోనే తాను “సహేలి” ఎన్జీవోస్ తో వివిధ రకాల ప్రయాణాలు చేసేటప్పుడు మహిళలు, యువతులు శారీరక రుగ్మతల నేపథ్యంతో ఇబ్బందులు పడకూడదనే, ఓ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వారిని మానసిక, శారీరక రుగ్మతల నుండి ప్రశాంతంగా ఉంచేందుకే “సహేలి” ఎన్జీవోస్ సంస్థను స్థాపించి ముందుకు సాగుతున్నారు.

వృత్తి న్యాయవాది.. ప్రవృత్తి మహిళలకు మేలు చేయాలనే లక్ష్యం

నేటి ప్రపంచంలో న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ అడుగంటి పోతున్న తరుణంలో ప్రముఖ న్యాయవాది కొమ్ము అనుపమ వాటన్నింటిని అధిగమించి ప్రస్తుత సమాజానికి వృత్తిపరమైన న్యాయం చేయాలని ఆకాంక్షతో న్యాయవాదిగా తనదైన శైలిలో స్పందిస్తూ న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో మహిళలకు ఎంతో మేలు చేయాలని కాంక్షతో తన వద్దకు వచ్చే మహిళ బాధితులను తనకు చేతనైనంత స్థాయిలో స్పందించడంతోపాటు మేలు చేసేందుకు కృషి చేస్తుంటారు.

Also read: RGV Heroine: నటనకు గుడ్ బై చెప్పి.. సన్యాసిగా మారిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్?

మరోవైపు కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు చేస్తున్న మహిళలు శారీరక రుగ్మతల నేపథ్యంలో (నెలసరి సమయంలో) స్వయంగా వీక్షించిన న్యాయవాది కొమ్మ అనుపమ చలించిపోయారు. ఏదైనా చేసి ఓ ప్రత్యేకమైన సంస్థ ను నెలకొల్పి మహిళలు ప్రయాణ సమయాల్లో పడుతున్న వేదనకు పులిస్టాప్ పెట్టాలనుకున్నారు. ఆ రకమైన కార్యరూపమే “సహేలి” పేరిట ఎన్జీవోస్ స్థాపించి మహిళలకు మేలు చేయాలని కృత నిశ్చయంతో పనిచేయాలని తపనతో సంస్థను స్థాపించారు. “సహేలి” (Saheli) ఎన్జీవోస్ మహిళా ప్రయాణికులకు మేలు చేయాలని లక్ష్యంతో ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రత్యేకమైన శానిటరీ నాప్కిన్స్ (Menstrual pads) లభించే విధంగా మిషనరీలను తయారు చేయించారు. సదరు మిషనరీలో ₹5 కాయిన్ వేస్తే మహిళలకు నెలసరి సమయంలో ధరించే సానిటరీ నాప్కిన్స్ అందుబాటులోకి వచ్చే విధంగా రూపొందించారు.

పైలెట్ ప్రాజెక్టు కింద ములుగు హనుమకొండ బస్టాండ్లలో

ప్రయాణ సమయాల్లో మహిళలు, యువతులు నెలసరి సమయంలో అందుబాటులో నాప్కిన్స్ లభించని సందర్భాలు స్వయంగా వీక్షించడం, అనుభవించడం తో న్యాయవాది అనుపమ వారందరికీ ఏదో రకమైన చర్యలు చేపట్టి వారికున్న సమస్యలను తీర్చాలని లక్ష్యంతో సహేలిని స్థాపించారు. ఈ కార్యక్రమంలో తొలుత పైలట్ ప్రాజెక్టు కింద ములుగు, హనుమకొండ బస్టాండ్ లో శానిటరీ నాప్కిన్స్ ఆటోమేటెడ్ వెండింగ్ మిషన్లను ప్రారంభిస్తున్నారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సేవలను వివిధ రకాల ప్రయాణాలు సాగించే మహిళలకు మేలు చేయాలని ఉద్దేశంతో పనిచేస్తున్నారు. రెండో దఫా హైదరాబాద్, హుస్నాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ బస్ స్టేషన్లలో ఈ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ (RTC) బస్ స్టేషన్లలో సైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు కృషి సహేలి ఎన్జీవోస్ (NGO) ఆధ్వర్యంలో వెండింగ్ మిషనరీ శానిటరీ నాప్కిన్ మహిళా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నారు.

నేపథ్యం

సహేలి నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలామంది కౌమార దశ విద్యార్థినులు, యువతులు, మహిళ ప్రయాణికులు నెలసరి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు అనుకోకుండా వచ్చే నెలసరితో ప్రయాణం చేసే సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియని సందిగ్ధత నెలకొంటుంది. దానికి తోడు సమాజంలో నెలసరి పట్ల taboo మల్ల బయటికి చెప్పుకోలేని స్థితిని మహిళలు ఎదుర్కొంటున్నారు. ఈ సవ్వాళ్ళు అన్నింటిని పరిష్కరించి, మహిళలు గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ప్రయాణించేలా చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

Also read: BJP Politics: హీటెక్కిన రాజకీయాలు.. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ?

దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ 

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేసే మహిళల కోసం దేశంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది. రాబోయే రెండు మూడు నెలల్లో తెలంగాణలోని అన్ని బస్సు డిపోలలో ఈ మిషన్లను విస్తరించాలని “సహేలి” ఎన్జీవో సంస్థ లక్ష్యం.

రవాణా శాఖ మంత్రి ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కలతో ప్రారంభం

ప్రాజెక్ట్ సహేలి కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్కలు సహేలి కార్యక్రమానికి సంబంధించి “అనౌన్సింగ్ ప్రాజెక్ట్ సాయ” పోస్టర్లను ఆవిష్కరించారు.

ఆ ఇబ్బందులను నేను అనుభవించా

మూడేళ్ల క్రితం హన్మకొండ నుండి హైదరాబాద్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, నెలసరితో ఇబ్బంది పడ్డాను. ఆ క్షణంలోనే ఇలాంటి సమస్య ఎదురయ్యే మహిళలకు ఏదైనా చేయాలనే ఐడియానే ఈ కార్యక్రమానికి నాంది పలికింది. దీంతో ఓ సర్వేను కండక్ట్ చేశాను. దీనికి తెలంగాణ కోర్టుల అడ్వకేట్స్, మహిళా అడ్వకేట్స్, విద్యార్థులు సహకారం అందించారు. స్త్రీ, శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్, ఆసనాల శ్రీనివాస్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. వీరి సహకారం మరువలేనిది. ఈ కార్యక్రమానికి వివిధ రకాల సంస్థలు, మహిళలు సహకారం అందించాలి. కుటుంబ సభ్యుల ఆశీస్సులతో సహేలి ద్వారా అనౌన్సింగ్ ప్రాజెక్ట్ సాయ కార్యరూపం దాల్చింది. సహేలి టీం పూర్తి సహకారం అందిస్తుంది. సహేలి ఎన్జీవోస్ ద్వారా మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. – కొమ్ము అనుపమ, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, ‘సహేలి’ ఎన్జీవోస్ వ్యవస్థాపకురాలు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?