RGV Heroine: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. ఎందుకంటే, వారికొచ్చే రెమ్యూనరేషన్ కూడా కోట్లలో ఉంటుంది. అయితే, తెర వెనుక అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఎవరికుండే కష్టాలు వారికి ఉంటాయి. వాటిని కొందరు అభిమానులతో షేర్ చేసుకుంటారు. కొందరు లోలోపల బాధ పడుతుంటారు. ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటీ నటులు .. ఎవరూ ఊహించని విధంగా సడెన్ గా మూవీస్ కు గుడ్ బై చెప్పేసి దూరంగా ఉంటారు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అలాగే చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ కి కూడా టఫ్ ఫైట్ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు అన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళింది. ఆమె ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Saraswati Pushkaralu:సరస్వతి పుష్కరాల్లో మంత్రి తుమ్మల సందర్శన.. అభివృద్ధి పనులపై సమీక్ష!
ఈమె ఎవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ బర్ఖా మదన్. 2003లో రామ్ గోపాల్ (Ram Gopal Varma) వర్మ దర్శకత్వం వహించిన హారర్ర్ మూవీ భూత్ లో మంజిత్ ఖోస్లా అనే పాత్రను నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రేఖ, ఫర్దీన్ ఖాన్, అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్ వంటి స్టార్ నటులతో కలిసి నటించింది. 2010 లో బర్ఖా ప్రొడ్యూసర్ గా మారి రెండు చిత్రాలను నిర్మించింది. ఆ తర్వాత 2012లో ఆమె బౌద్ధమతంలోకి మారాలని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు చూసి, ఇలాంటి నిర్ణయం తీసుకుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. సినీరంగానికి దూరమయ్యి 13 ఏళ్ళ నుంచి సన్యాసి జీవితాన్ని గడుపుతుంది. ఈ బాలీవుడ్ భామ ఎక్కువగా పర్వాతాలలో నివసిస్తుంటుంది.
Also Read: Anti-Narcotics Award: ప్రపంచంలోనే నెంబర్ వన్.. పోలీసుల కిరీటంలో మరో కలికితురాయి..