Warangal (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal: ఇన్స్‌స్టా గ్రామ్‌లో రీల్ పోస్ట్.. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం

Warangal: ఓ ముద్దు రీల్ ఓరుగల్లులో(Warangal News) వివాదం రేపింది. వరంగల్ కొత్తవాడకు చెందిన ఓ బాలుడు బాలిక ముద్దు పెట్టుకున్నారు. ఈ వెకిలి చేష్టలు అంతటితో ఆపకుండ వారి తతంగాన్ని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తీసుకున్న సెల్పీని ఇన్స్టాగ్రామ్(Instagram) రీల్ పోస్ట్ చేశారు. దీంతో తలెత్తిన వివాదం మొదలై తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఘర్షణ ముదురి ఒకరిపై మరొక వర్గం మారణ ఆయుధాలతో దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తవాడకు చెందిన ఒకే సామాజిక వారగానికి చేసిన బాలుడు, బాలిక(మేయర్లు) సాన్నిహిత్యంగా మెదులుతూ ఇటీవలే సెల్పీ తీసుకుంటూ ముద్దు పెట్టుకునే వీడియో తీసి దాన్ని ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఒకరిపై మరొక వర్గం ఆయుధాలతో దాడి
ఇది ఇరువురి కుటుంబాల దృష్టికి వెళ్ళింది. ఇదే విషయంపై బాలుడిని బాలిక కుటుంబ సభ్యులు బంధువులు మందలిస్తున్న క్రమంలో బాలుడి కుటుంబ వారి తరుపు బంధువులు బంధువులు ఎదురు పడడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేసుకునే స్థాయికి వివాదం ముదిరింది. దీంతో శుక్రవారం రాత్రి అక్కడ పరిస్థితి ఉదృతంగా మారింది. ఒకరిపై మరొక వర్గం ఆయుధాలతో దాడికి పాల్పడిన ఘటనలో పలువురికి గాయాలు ఆయినట్టు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు(police) ఇరు వర్గాలను చెదరగొట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Hard Time for Farmers: పత్తి రైతుల ఎదురుచూపులు.. నగదు చేరేదెప్పుడు?

 

 

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు