Uttam Kumar Reddy: గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ కడుతూ రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Min Bhatti Vikramaraka) కృషి చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Min Uttam Kumar Reddy) పేర్కొన్నారు. ఖమ్మం(Khammam) జిల్లాలోని మధిర మండలం వంగవీడు గ్రామంలో జవహర్ ఎత్తిపోతల పథకానికి రూ.600 కోట్ల నిధులతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు
గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు, రైతులకు ఉపయోగపడే ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందించడంలో డిప్యూటీ సీఎం కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్(Congress) నాయకులు, కార్యకర్తల తోటే తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ నిలబడిందని పేర్కొన్నారు. ఈ నాయకులు, కార్యకర్తల శ్రమతోటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని వెల్లడించారు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు ఒకరు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి, మరొక పవర్ఫుల్ మినిస్టర్ గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ, ఐ అండ్ పిఆర్ మంత్రిగా, ఇంకొకరు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు(Min Thumala Nageshwar Rao) రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఒక్కోసారి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy) అనుకుంటాం. రాష్ట్రాన్ని నడిపించేది ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులేనని. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన శాఖలన్నీ ఖమ్మం జిల్లా వారికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు.
ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే
ఉమ్మడి జిల్లా ఖమ్మం కార్యకర్తలకి నేను సెల్యూట్ చేస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్మీ జవాన్ గా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో ఖమ్మం జిల్లా నాయకులు తట్టుకొని, ఎన్నో రకాల కేసులను పోలీస్ స్టేషన్లో నమోదు చేసినప్పటికీ దీటుగా ఎదుర్కొని నిలబడ్డారని ప్రశంసించారు. ఖమ్మం జిల్లా ఎప్పటికీ కాంగ్రెస్(Congress) కు కంచుకోటనేనని అభినందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి ప్రభుత్వం ఎంత చేసినా తక్కువేనని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ(Nalgonda) జిల్లా కూడా కంచుకోటగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాటి వెంగళరావు నుంచి నేటి మల్లు భట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponguleti Srinivass Reddy), తుమ్మల నాగేశ్వరరావు వరకు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుందన్నారు.
Also Read: Drug Peddlers Arrested: మరో భారీ సక్సెస్ సాధించిన ఈగల్ టీం.. స్మగ్లర్ల అరెస్ట్
తప్పు చేయొద్దని లక్ష్యంతో
రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రీ డిజైన్ చేసి రూ.20 వేల కోట్లకు అంచనాలను పెంచిందన్నారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి ఎలాంటి అభివృద్ధి చేయకుండానే రూ. పదివేల కోట్లను ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకొని మిగిలిన రూ.10 వేల కోట్లతో పూర్తి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. టిఆర్ఎస్(TRS) తప్పు చేసిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తప్పు చేయొద్దని లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా రైతులకు గోదావరి నది నీళ్లు అందించడమే ధ్యేయంగా పనిచేస్తుందని వెల్లడించారు. బనకచర్ల ప్రాజె(Banakacherla Project)క్టు కడుతున్న ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం అన్నారు. గోదావరి నది జలాల పంపకాల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై సిడబ్ల్యుసి(CWC) లో సైతం వ్యతిరేకంగా మాట్లాడాలని ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.
మూడేళ్లలో కూలిపోయేందుకు కుట్ర
బనకచర్ల ప్రాజెక్టు కట్టకుండా ఆపాడమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని చెప్పారు. అదేవిధంగా కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లతో కట్టి మూడేళ్లలో కూలిపోయేందుకు కుట్ర చేసింది బీఆర్ఎస్(BRS) పార్టీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టి కాలేశ్వరం కడుతున్నామని టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని విమర్శించారు. నేడు ఒక్క ఎకరానికి కూడా కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)కు డిజైన్, కట్టడం, కూలిపోవడం అంత జరిగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని వివరాలను ప్రజలకు తెలియాల్సిన పరిస్థితిలో సుప్రీంకోర్టు జడ్జి పిసి గోష్(PC Gosh) చేత విచారణ జరిపి కాలేశ్వరం లోటు పాట్లను వివరించామన్నారు. జస్టిస్ పిసి గోష్ నేతృత్వంలో విచారణ జరిపి గత ప్రభుత్వ అవినీతితోటే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రిపోర్ట్ ఇచ్చిందన్నారు.
Also Read: Suryapet police: అనంతగిరిలో నయా మోసం.. ప్రభుత్వ ఆదాయానికే కన్నం