Khammam District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Khammam District: ఖమ్మం జిల్లా సర్వేకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు

Khammam District: ఖమ్మం జిల్లా సర్వే శాఖలోని సంబందిత మండల ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్(IKP Community Surveyor) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ. సత్తుపల్లి మండలంలో విధుల నిర్వహానలో నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన ఓ ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఖమ్మం జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్‌కి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(Human Rights Commission) 29 ఆగస్ట్ 2025 న తెలంగాణ మానవ హక్కుల కోర్టుకి రావాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు.

సర్వీసు నిబంధన ఉల్లంఘన – స్థానిక ప్రజలు ఆందోళన
సత్తుపల్లి మండలానికి చెందిన స్థానికుడైన ఓ వ్యక్తి మొదటగా 2020లో ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్‌గా స్థానిక సత్తుపల్లి లోనే ఉద్యోగంలో చేరి, కొన్ని సంవత్సరాల తరువాత ఖమ్మం(Khammam) రూరల్ మండలానికి బదిలీ అయినప్పటికీ, నియమాలకు విరుద్ధంగా జిల్లా సర్వే అధికారులు అంటే లెక్కలేని విధంగా సత్తుపల్లి తహసిల్దార్ కార్యాలయంలోనే కొనసాగాడని ఆరోపణలు ఉన్నాయి. సర్వీసు నిబంధనలకు తూట్లు పొడుస్తూ, తన ఇష్టానుసారంగా భూములపై సర్వేలు చేయడం, ఇతనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా మండల తహసీల్దార్(MRO) స్పందించకపోవడమేమిటోనని సత్తుపల్లి మండల ప్రజలును ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్వేలో మోసాలు – కోర్టు ఆదేశాలు
కొమ్మేపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 132లో భూములు ఉన్నాయని, సర్వే నెంబరు 150లో భూములు లేవన్న స్పష్టత గ్రామ నక్షలో ఉన్నా అక్కడి భూములపై అధికారుల ఆదేశాలు లేకుండా అక్రమ సర్వేలు చేసినట్టు ఆరోపణలున్నాయి. లింగపాలెం గ్రామానికి చెందిన దళిత రైతుల భూములను కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్న వేళ, వీరికి అండగా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించి రెండు పర్యాయాలు ఇంటర్మ్ ఆదేశాలు (WP27431/2023, WP15290/2023) తెచ్చుకున్నప్పటికీ, ఇతను అవేమీ పట్టించుకోకుండా సత్తుపల్లి మండల సర్వేయర్‌తో కలిసి మరలా అదే ప్రాంతంలో సర్వే చేయబోయిన సందర్భాలు చోటుచేసుకున్న వేళ రెండుసార్లు రెండు సంవత్సరముల కాలంలో (2023,2024) ఇద్దరు మండల తహసీల్దారుల పైన కంటెంప్ట్ కేసులు CC1358/2023,CC387/2024 నమోదు అయ్యాయి. ఇట్టి కంటెంప్ట్ కేసుల నుండి తహసిల్దారులను తప్పించడానికి రైతుల భూములను ఫారెస్ట్ భూములుగా చిత్రీకరిస్తూ తప్పుడు సర్వే రిపోర్టు తయారుచేసి ఖమ్మం జిల్లా కలెక్టర్‌కి, గౌరవ హైకోర్టుకి పంపించారు.

Also Read: Viral News: బెంగళూరులో వింత పరిస్థితి.. ఆఫీసులు మూసివేయాలంటూ డిమాండ్లు

సత్తుపల్లి(Sathupally) మండల తహసిల్దార్ కార్యాలయంలో ఇతనికి సహకరించని జూనియర్ అసిస్టెంట్ల పైన మండల తహసీల్దార్‌కి కార్యాలయంలోని సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు చేరవేస్తారని చాడీలు చెప్తూ తహసిల్దార్ చేత తిట్టిస్తారని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో దళితులపై, అంబేద్కర్ వంటి మహానుభావులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తాడని ప్రజలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోక్యం
ఈ వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు యాదాల శ్రీనివాస్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమిషన్, దళితులపై వివక్ష, కోర్టు ఆదేశాల ఉల్లంఘన, అక్రమ సర్వేలు వంటి అంశాలపై విచారణ కోరుతూ జిల్లా సర్వే AD(S&LR)కి వచ్చే నెల 29న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.

ప్రజల డిమాండ్
సర్వే నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న వ్యక్తిని సత్తుపల్లి తహసిల్దార్ కార్యాలయం నుండి తొలగించాలని, అతని డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని, ఖమ్మం జిల్లా సర్వే డైరెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ, అన్యాయమైన భూసంబంధ విషయాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తించే ఉద్యోగులపైన కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

Also Read: Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం సంచలన నిర్ణయం

 

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?