Khammam ( image CREDIT: TWITTER OR SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Khammam: ఖమ్మంలో కాంగ్రెస్ నేత సెటిల్మెంట్ హవా.. మిక్కిలినేని నరేంద్రపై ప్రజల ఆగ్రహం!

Khammam: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం (Khammam) కార్పొరేటర్ మంజుల భర్త మిక్కిలినేని నరేంద్ర, ( Mikkilineni Narendra) రాజకీయ ముసుగులో సెటిల్మెంట్ దందాలు, భూదందాలు, కుటుంబాల మధ్య కలహాలు పెడుతూ ప్రజలను భయపెడుతున్నాడని పలువురు పీసీసీకి ఫిర్యాదు చేస్తున్నారు. నరేంద్ర, అనుచరులు సహకారంతో, వ్యక్తిగత లాభాల కోసం రాజీయం చేస్తూ, సెటిల్మెంట్ పేరుతో దోపిడి, భూదందాలు, రౌడీయిజం చేస్తున్నారని, వీడీవోస్ కాలనీకి చెందిన చేకూరి శేఖర్ ఆయన కుటుంబ స్థిరాస్తి రూరల్ ఎదులాపురం పెద్ద తండా, సర్వే నెంబర్ 221, 222 1210 చదరపు గజాల ఖాళీ ప్లాట్ను 16/9/2019 న పంచాయతీ సెటిల్మెంట్ లో భాగంగా మిక్కిలినేని నరేంద్ర తన పేరున అగ్రిమెంట్ చేసుకుని, కుటుంబ పంచాయతీని కాలయాపన చేస్తూ దివంగత సత్యం బాబు ఉమ్మడి ఆస్థిలో భాగం ఉన్న ఈ వివాదంలో, పెద్ద కుమారుడు శ్రీధర్ కి మద్దతు ఇచ్చి, చిన్న కుమారుడు శేఖర్ పై పోలీసు కేసులు పెట్టడం, భయపెట్టడం, కుటుంబాన్ని ఒత్తిడికి గురిచేయడం ఇవన్నీ నరేంద్ర నేరుగా చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.

 Also Read:

రౌడీయిజం చేసే నేతలకు కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి

ఖమ్మం పట్టణంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్ దందాలు, రౌడీయిజం చేసే నేతలకు కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని, మిక్కిలినేని నరేంద్ర, అతని భార్య, తమ్ముడు మరియు బృందం మీద క్రమశిక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి అని పలువురు పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి నాయకుల వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని, భూదందాలు, వ్యక్తిగత లాబం కోసం సెటిల్మెంట్ దందాలు, ప్రజలను భయపెట్టడం ఇలా కొనసాగితే పార్టీ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింటుందని ఫిర్యాదు లేఖలల్లో వారు వివరించారు.

అసలు విషయం పక్క దారి

చేరుకూరి సత్య బాబు కుటుంబ పంచాయతీలో కలుగ చేసుకొని సెటిల్మెంట్ దందా క్రింద 2 కోట్ల విలువైన భూమిని అగ్రిమెంట్ చేసుకొని నిత్యం శ్రీధర్ కి పక్కన ఉండి వకల్త పుచ్చుకొని చిన్న కుమారుడు శేఖర్ కి స్థిర, చర ఆస్తుల్లో అన్యాయం చేస్తున్నాడని గత రెండు నెలలుగా అందరు పెద్ద మనుషులు బావిస్తుంటే ఏక పక్షంగా మాట్లాడుతూ పంచాయతీ పరిష్కారం కాకుండా ఉద్దేశపూర్వకంగా కొందరు పెద్ద మనుషులను దూషించడంలో భాగంగా దాడీ జరిగితే దాన్ని చిలువలు పలువలు చేసి మసిపూసి మారేడు కాయ అన్నట్లు మిక్కిలినేని నరేందర్, ఆయన భార్య కార్పొరేటర్ మంజుల తప్పుగా ప్రజలకు, మీడియాకు వెల్లడిస్తున్నారని, పైగా తామేదో ఘన కార్యయం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలను నిందిస్తున్నారని బాధితులు, పెద్ద మనుషులు చెపుతున్నారు. ప్రజా క్షేత్రంలో సెటిల్మెంట్ లో ఇతను, ఇతని తమ్ముడు అరాచకాలు దాడులు, ప్రతిదాడులు, కబ్జాలు ఖమ్మం పట్టణ ప్రజలకు బాగా తెలిసేందే అని పోలీస్ రికార్డులే చెపుతాయని అంటున్నారు. సెటిల్మెంట్ దందా చేస్తున్న మిక్కిలినేని నరేంద్ర సోదరుల ఆకృత్యాల డాక్యుమెంట్ త్వరలో రాష్ట్ర పోలీస్ అధికారులకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మీడియా సమక్షంలో బాధిత కుటుంబాలు బయటపెట్టె అవకాశం ఉంది. 

Also Read: Khammam Incident: దీపావళి మందులో షాపు యజమానిపై మంత్రి తుమ్మల అనుచరుడి దౌర్జన్యం

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!