Khammam Incident: దీపావళి మందుల షాపు నిర్వాహకుడిపై మంత్రి తుమ్మల అనుచరుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బ్రతకాలని లేదురా అంటూ బూతులతో వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దీపావళి మందుల షాపు దుకాణంలో నిర్వాహకుడి పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ నేలకొండపల్లి మండలం సూర్దేపల్లి గ్రామ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.
Also Read: Fitness Secrets: 50 ఏళ్ల వయస్సులో కూడా అందంగా కనిపించాలంటే.. ఎలాంటి డ్రింక్ తీసుకోవాలో తెలుసా?
శనివారం కొణిజర్ల లోని దీపావళి టపాసుల షాపు నిర్వాహకుడి వద్దకు వెళ్లి అత్యధిక రేట్లకు అమ్ముతున్న సదరు వ్యాపారిపై మాటల దాడికి దిగాడు. అధికరేట్లకు అడ్డగోలుగా అమ్ముతూ ప్రజలకు పంగనామం పెడుతున్న షాపు నిర్వాహకుడి పై వీరంగం సృష్టించాడు. షాపును తక్షణమే తొలగించకపోతే తన మనుషులను పంపించి చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకపోవడంతో పాటు ఏసీబీకి ఫోన్ చేసి నానా బూతులు తిడుతూ హంగామా సృష్టించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ షాపు నిర్వాహకుడి పై అసభ్యకరంగా బూతులు మాట్లాడి, రౌడీల వ్యవహరించిన లక్ష్మణ్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Internet : ఇంటర్నెట్ ను సముద్రం నుంచి గుట్ట గుట్టలు తీస్తున్నారా.. అసలు ఇది ఎక్కడ నుంచి వస్తుంది?
