Mobiles Handed over: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అప్పగింత
Mobiles Handed over (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mobiles Handed over: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత

Mobiles Handed over: పోగొట్టుకున్న28 మొబైల్ ఫోన్లను (CEIR) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ డీసీపీ(DCP) లా&ఆర్డర్ ప్రసాద్ రావు(Prasad Rao) తెలిపారు. ఇప్పటివరకు పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బాధితులు CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో మొబైల్ ఫోన్ ట్రాక్(Mobile phone track) చేసిన ఐటి సెల్ బృందం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనలతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో యజమానులకు అడిషనల్ డీసీపీ చేతుల మీదుగా అప్పగించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ పోర్టల్ విధానంతో సుమారు ఎనిమిది లక్షల విలువ గల 28 ఫోన్లను ట్రేస్‌ చేసి, నిజమైన యజమానులకు అప్పగించినట్లు తెలిపారు.

అత్యంత కీలక పరికరం
ఒక్కొక్క మొబైల్ ఫోన్ యాబై వేల నుండి 10 వేల రూపాయలు ఖరీదు గల ఫోన్లను ట్రాక్ చేయడం జరిగిందన్నారు. ఖమ్మం(Khammam) కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే మొబైల్ ఫోన్లు7121 పోగొట్టుకున్నట్లు CEIR పోర్టల్ ఫిర్యాదులు నమోదు కాగా 2360 ఫోన్ల ట్రాక్‌ను గుర్తించి మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్(Mobile Phone) అత్యంత కీలక పరికరం అయ్యిందని, ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న నగదు లావాదేవీలు చేయాలన్న మొబైల్ ఫోన్ పైనే ఆదారపడేంతగా ప్రాదాన్యం సంతరించుకుందని అన్నారు.

Also Read: Harish Rao: బాధితులకు కోటి రూపాయల పరిహారం అందేనా: హరీష్ రావు

కీలకంగా వ్యవహరించిన ఐటి
మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న చోరికి గురైతే పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించనవసరం కష్టమేనని అన్నారు. పోయిన ఫోన్‌లను వెతికి పెట్టడానికి పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందన్నారు. సెల్ ఫోన్ల రికవరీ(Cell phone Recovery)లో కీలకంగా వ్యవహరించిన ఐటి(IT) సెల్ ఎస్సై సత్యనారాయణ, టెక్నికల్ బృందాన్ని ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అభినందించారు.

Also Read: Fake Embassy: నకిలీ ఎంబసీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..