Karthika Pournami 2025: జిల్లాలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి శైవ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివనామ స్మరణతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉసిరి చెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సన్నిధిలో కార్తీకదీపం వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. శివపార్వతులకు అభిషేకాలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తుతుండగా నది స్నానాలు ఆచరించి కార్తీకదీపం వెలిగించి నదీమ హారతినిచ్చారు. కృష్ణా నదిలో మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా జోగులాంబ అమ్మవారు, బీచుపల్లి శివాలయంకు దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు.
కార్తీక పౌర్ణమి విశిష్టత
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని పురాణాలు చెబుతున్నాయి. శివకేశవునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో మహా దేవుడికి విష్ణుమూర్తికి పూజలు చేస్తే జన్మజన్మల పాపం నశిస్తుందని భక్తుల విశ్వాసం పౌర్ణమి రోజు పవిత్ర నదిలో స్నానం చేసి శివార్చన చేయడం వలన పాపాలు తొలగి పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
