Karimnagar Rains: రాష్ట్రంలో బారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాఫ్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రోడ్లపై వరదనీరు ప్రవహించడంతో పాటుగా పలు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇదే సమయంలో ఈ పరిస్థితుల్లో ఓ పెళ్లి వేడుకకు వెళ్తున్న వరుడు, మరియు అతని కుటుంబసభ్యులు పెద్ద కష్టాన్ని ఎదుర్కొవలసి వచ్చింది. పెళ్లి వేడుకకు వెల్లాల్సిన వరుడు మరియు అతని కుటుంబ సబ్యులు వరదలో చిక్కు పోయారు.
వరుడిని భుజాన ఎత్తుకొని
కరీంనగర్(Karimnagar) జిల్లాలో భారీ వర్షాల కారనంగా ఓ సంఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఓ గ్రామంలో పెళ్లి వేడుకకు వరుడు బయలు దేరాడు. వరుడు పెళ్లి చేసుకోవాల్సిన ఉరు వెల్లే క్రమంలో ఆ ప్రాంతంలో భారీ వర్షాలకు వాగులు వంకలు నీటితో పోంగి పోర్లుతున్నాయి. దీంతో వరుడు వాగుదాటి వెల్లలేకుండా వరద నీరు ప్రవహిపస్తున్నాయి. ఒ పక్క ముహూర్తం పమయం దగ్గరపడుతుండటంతో సమయానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఎర్పడింది. ఓ పక్క వర్షం ఆగేలా లేదు, వరద తగ్గేలా లేదు. దీంతో వరుడు ఆగిపోతే ముహూర్తం మిస్సవుతుందని భావించిన బంధువులు అతని స్నేహితులు అందరు కలిసి ఒక ఆలోచనకు వచ్చారు. వర్షం తగ్గేలా లేదని వెంటనే పెళ్లి కొడుకుని భందువులు భుజాన ఎత్తుకుని, జాగ్రత్తగా వాగు దాటారు. రోడ్డుపై వర్షపు నీరు బలంగా ప్రవహిస్తున్నప్పటికీ, తమ స్నేహితుడు, బంధువు పెళ్లి సమయానికి జరిగిపోవాలనే ఉద్దేశంతో ఈ సాహసానికి వారు ఒడిగట్టారు.
Also Read: TTD: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై చర్యలకు సిద్ధమైన టీటీడీ!
సోషల్ మీడియాలో వైరల్
అయితే ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కోంతమంది ఆశ్చర్యపోయారు. ఇలాంటిది సంఘటనలు సినిమా(Movie)లో మాత్రమే చూస్తాం, ఇప్పుడు నిజంగా స్వయాన చూస్తున్నామని హస్యస్పదంతో వ్యాఖ్యానించారు. అయితే ఈ సంఘటనను అక్కడి వ్యక్తులు ఫోన్‌లో వీడియో తీశారు. దీంతో ఇ వార్త సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. కొందరు వ్యక్తులు దీన్ని హాస్యాస్పదంగా పంచుకున్నప్పటికి, మరికొంత మంది పెళ్లి అనేది లైఫ్‌లో ఎంత ముఖ్యమో దనికి ఇదే సాక్ష్యం అని అంటున్నారు. ఎదేమైనా భారీ వర్షాలకు ఓ పక్క రైతులు ఆనంద పడుతున్నప్పటికి ఈ వరుడికి మాత్రం వర్షం పెద్ద కష్టమే తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.
Also Read: Warangal Rains: భారీ వర్షానికి వరంగల్ అతలాకుతలం.. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు