Bhadrachalam (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Bhadrachalam: ఇళ్ల స్థలానికి గజానికి రూ.20 వేలు చెల్లించాలి.. ఆ ప్రజలు డిప్యూటీ కలెక్టర్ కు వినతి!

Bhadrachalam: డోర్నకల్ భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో వ్యవసాయ భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ మార్కెట్ రేటు ప్రకారం చెల్లించి న్యాయం చేయాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరికి కారేపల్లి భూ నిర్వాసితులంతా వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో రైల్వే లైన్ డబ్లింగ్ భూ నిర్వాసితుల తో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పాల్గొని భూసేకరణ నిబంధనలను వెల్లడించారు. భూ నిర్వాసితులు ఇచ్చిన విన్నపాలను కూడా ఉన్నతాధికారులకు నివేదిస్తానని గ్రామసభలో తెలిపారు.

Also Read: Bhadrachalam: ఆదివాసీ విప్లవ వీరుడు.. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమరం భీమ్

రైతుల పేర్లు భూసేకరణ ఫైనల్ గెజిట్

ఈ గ్రామసభలో పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ సింగరేణి రెవెన్యూ గ్రామం నాన్ ఏజెన్సీ కాబట్టి వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.91 లక్షల చొప్పున, ఇండ్లు కోల్పోయిన వారికి గజం ఒక్కింటికి రూ.20 వేల చొప్పున మార్కెట్ రేటు చెల్లించాలని భూ నిర్వాసితులు కోరారు. రెవిన్యూ రికార్డుల ప్రకారం మార్కెట్ వ్యాల్యూ చూసినా కారేపల్లికికి చెందిన భవనాసి గణేష్ సర్వే నెంబర్ 200/2/1/1 లో రూ .9148000 చూపుతోందని , గుండెబోయిన కోటేశ్వరరావుకు చెందిన సర్వేనెంబర్ 77ఆ/2 లో రూ .1125000 గా నమోదయిందని ,ఇదే గ్రామానికి చెందిన ముండ్ల సుధాకర్ సర్వేనెంబర్ 52/6 లో రూ.1125000 గా భూభారతిలో మార్కెట్ వాల్యూ నమోదయి ఉన్నదని పేర్కొన్నారు.ఈ ముగ్గురు రైతుల పేర్లు భూసేకరణ ఫైనల్ గెజిట్ జాబితాలో ఉన్నాయి కాబట్టి ఈ మార్కెట్ వ్యాల్యూలను కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని భూ నిర్వాసితులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను వేడుకున్నారు. ఈ గ్రామసభలో తహసిల్దార్ రమేష్, రైల్వే జేఈ శ్రీకాంత్, ఏవో అశోక్, సర్వేయర్ కిరణ్ పాల్గొన్నారు.

 Also Read: Bhadrachalam Tragedy: భద్రాచలంలో ఘోరం.. ఆరుగురు కూలీలు స్పాట్ డెడ్

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..