Students Fall Ill( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Students Fall ill: పురుగులు పట్టిన పిండితో ఇడ్లీ తయారు.. మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం

Students Fall Ill: పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)మరియు ఆశ్రమ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇంకా తీరేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఎన్నో ఘటనలు జరిగినా, మెస్ సిబ్బంది అలసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల(Tribal Ashram School)లో, పురుగులు పట్టిన పిండితో ఇడ్లీలు తయారుచేసి విద్యార్థులకు వడ్డించడంతో, మరోసారి ఫుడ్ పాయిజన్(Food poisoning) కలకలం రేపింది. దీని వల్ల నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.

 Also Read:Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్ 

కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న వీరిని తక్షణమే కల్లూరు ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే బాధ్యత ఎవరిది? వార్డెన్? మెస్ సిబ్బంది? లేక పాఠశాల నిర్వహణలో ఉన్న అధికారులందరిదా? ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కడుపుమండిపోతున్నారు. తగు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, ప్రతి పదార్థాన్ని పరిశీలించే విధానం తీసుకురావాలని కోరుతున్నారు.

పిల్లల ఆరోగ్యంపై కుట్ర

నలుగురే కదా… అందుకే ఎవరూ పట్టించుకోలేదు అంటూ తల్లిదండ్రులు,(parents)గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటే హడావుడి ఉండేది. ఇప్పుడు నలుగురే కదా అంటూ పై అధికారుల నుంచి కూడా స్పందన కనిపించడం లేదు” అని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కల్లూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి ఏనుగుల అంజి స్పందిస్తూ, ఇది చిన్న విషయం కాదు. ఇది పిల్లల ఆరోగ్యంపై కుట్ర లాంటి వేధింపు. ప్రభుత్వం, అధికారులు దీనిపై సీరియస్‌గా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి” అన్నారు. ఒక్కరోజుకి ఒక్క సంఘటన అని ఊరుకుంటే, రేపు ఇంకెంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయో ఎవరికీ తెలియదు. “ఇదే జరిగిందని చెప్పేందుకు యుద్ధనౌకలు కనబడకుండా పోయినట్టు నిస్సహాయంగా చూస్తూ ఉండలేం” అని తల్లిదండ్రులు,(parents వేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా స్పందించండి సారూ… నలుగురు కాదు, వాళ్లవి కూడా ప్రాణాలే.
సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలు దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఎక్కువ మంది పిల్లలు ఉంటే హడావుడిగా వస్తారు, నలుగురే కదా అని ఎవ్వరూ రాలేదు” అంటూ మండిపడుతున్నారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు చూస్తున్నారన్న భయం కానీ, బాధ్యత కానీ తగిన అధికారుల్లో కనిపించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Also Read: Mulugu Farmers: ఎట్టకేలకు న్యాయం.. ఆ రైతన్నలకు పరిహారం ప్రకటన..

Just In

01

Telugu Reality Shows Impact: తెలుగు రియాలిటీ షోల వల్ల ఎంటర్‌టైన్మెంట్ తప్పుదారి పడుతుందా?.. అసలు వాటి వల్ల లాభమా?.. నష్టమా?

Medchal News: వివాదంలో శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయం.. నోటీసులు జారీ..!

Gold Price Today: అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్ రేట్స్?

SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్