Kadiyam Srihari: ఉపఎన్నికలు వస్తే తాను పారిపోనని, తప్పకుండా తానే పోటీ చేస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో తానే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండలో పాత్రికేయులతో మాట్లాడిన కడియం శ్రీహరి, స్పీకర్ నోటీసుల అంశంపై స్పందించారు. “నిన్ననే స్పీకర్‌ను కలిసి కొంత సమయం కావాలని అడిగాను. స్పీకర్ నిర్దేశించిన గడువులోపు తప్పకుండా వివరణ ఇస్తాను” అని ఆయన అన్నారు.
Also Read: Kadiyam Srihari: జీడికల్ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి.. ఎమ్మెల్యే కడియం కీలక అదేశాలు!
ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం
ఇప్పటివరకు వివరణ ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమి లేవని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని వివరణ ఇవ్వాలనే ఇన్ని రోజులు ఆగానని తెలిపారు. స్టేషన్ ఘనపూర్‌కు తాను చాలా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఉపఎన్నికలు వస్తే స్టేషన్ ఘనపూర్ ప్రజల ఆశీర్వాదం తనకే ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

