Jogulamba Gadwal: గద్వాల్లో రగులుతున్న స్థానిక రాజకీయం
Jogulamba Gadwal imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal: గద్వాల్లో రగులుతున్న స్థానిక రాజకీయం.. ఆశావహుల్లో పెరిగిన ఉత్సాహం

Jogulamba Gadwal: గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు వాయిదా పడతాయా అనే ఉత్కంఠతో ఎదురుచూసిన ఆశావహుల్లో షెడ్యూల్ విడుదల కావడంతో పోటీకి సర్వం సిద్ధం చేసుకునే ఉత్సాహం నెలకొంది. జిల్లా అధికారులు ఇప్పటికే ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది.

మూడు విడుతల్లో..

రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 11, 14, 17 తేదీలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక దశకు మరో దశకు మధ్య మూడు రోజుల వ్యవధిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని జిల్లా అధికారులు ప్రకటించారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.

Also Read: Srinivas Goud: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతాం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు..

జిల్లాలో మొత్తం 3.94 లక్షల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1.99 లక్షల మంది మహిళలు, 1.93 లక్షల మంది పురుషులు ఉన్నారు. 13 మండలాలలో ఉన్న 255 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో గద్వాల, ధరూర్, కేటీ దొడ్డి, గట్టు మండలాల్లోని 106 గ్రామపంచాయతీలకు 974 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండవ విడతలో ఐజ, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి మండలాలలోని 74 గ్రామపంచాయతీలకు 716 పోలింగ్ కేంద్రాలు, మూడవ విడతలో ఇటిక్యాల, ఎర్రవల్లి, మానవపాడు, అలంపూర్, ఉండవల్లి మండలాలలో 75 గ్రామపంచాయతీల ఎన్నికలకు 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,390 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల నిబంధనలు పాటించాలి..

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎక్కువ మొత్తంలో డబ్బులను బ్యాంకులో నుంచి డ్రా చేయవద్దని, డబ్బులకు సంబంధించిన ఆధారం లేకుండా వాహనాల్లో తరలిస్తే సీజ్ చేయబడతాయని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లాలో మూడు విడతలలో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని, అభ్యర్థులు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని, పోలింగ్ బందోబస్తు ఏర్పాటు కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Also Read: The Rise Of Ashoka: ‘వినరా మాదేవ’ జాతర పాట చూశారా? శివ భక్తులకు పండగే!

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!