Srinivas Goud: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతాం
Srinivas Goud ( IMAGE credDIT: SWETCHA REPORTER)
Political News

Srinivas Goud: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతాం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud:  బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన చీర తీసుకుని తమకు ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి అంటున్నాడని, మరి రెండు సంవత్సరాల నుండి ఎందుకు చీరలు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్నికల కమిషన్ ఎక్కడకు పోయిందన్నారు. బీజేపీ పార్టీ ఎక్కడకు పోయిందని మండిపడ్డారు. ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టు ఉంది.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వైఖరి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడకు పోయాయన్నారు. అవ్వ తాతకు ఇస్తానని చెప్పిన పెన్షన్ ఎక్కడకు పోయిందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగులకు బీసీ రిజర్వేషన్ల పై మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.

Also Read: Srinivas Goud: బీసీరిజర్వేషన్లుకు చట్టబద్దత కల్పించాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

ఒక్క బీసీ సర్పంచ్ లేడు జీరో

ఖమ్మం జిల్లాలో రఘునాథ పాలెం లో ఒక్క బీసీ సర్పంచ్ లేడు జీరో అన్నారు. మహబూబ్ నగర్ లో చాలా చాలా గ్రామాల్లో బీసీ సర్పంచ్ లు లేరు,వార్డు మెంబర్లు లేరు అని దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ లకు 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డు మెంబర్లకు ఇస్తారు సర్పంచ్ లకు మాత్రం అది ఇవ్వరు.. బీసీ రిజర్వేషన్ల పై ఎక్కడ నియమనిబంధనలు పాటించడం లేదన్నారు. బీసీ లను నిట్టనిలువుగా ముంచింది.. కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కిందన్నారు. విద్యార్థులురా మీ భవిష్యత్తు కోసం మా బీఆర్ఎస్ పార్టీ కోట్లాడుతుందని వెల్లడించారు. అసెంబ్లీ లో విద్యా ఉద్యోగాలు, రాజకీయ పదవుల గురించి బిల్లు పాస్ చేశారు.

బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం

కానీ ఇప్పుడు విద్య ఉద్యోగాలు ఎక్కడకు పోయాయి ఆ బిల్లును ఎందుకు రాష్ట్రపతికి పంపలేదు. బీసీలకు మంత్రి పదవులు కూడా ఇవ్వలేదన్నారు. సర్పంచ్ ఎన్నికల లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్ల తోనే ఎన్నికలకు పోతాం అన్నాడు పీసీసీ అధ్యక్షుడు ఎక్కడ పోయింది మీ మాట అని ప్రశ్నించారు. బీ ఫారం లేని ఎన్నికలు ఇవ్వి, పార్టీ నుంచి గెలిపిస్తాం అనడం ఏంటి అని నిలదీశారు. మూడు వేల కోట్లకు చూసుకుంటే బీసీలు నిలువునా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Srinivas Goud: రిజర్వేషన్ల పెంపు జీవో చెల్లదని వారికి తెలియదా.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?