Students Protest (image CREIT: SWETCHA REPPORTER)
నార్త్ తెలంగాణ

Students Protest: ఆర్టీసీ బస్సుల సర్వీసులు పెంచాలని విద్యార్థుల నిరసన

Students Protest: మారుమూల గ్రామాల నుంచి ధరూరు మండలం, జిల్లా కేంద్రంలో చదివే విద్యాసంస్థలకు చేరుకునేందుకు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.అదనంగా ఆర్టీసి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)ధరూర్ మండలం ఉప్పేర్ హై స్కూల్ విద్యార్థులు ఆర్టీసి‌ బస్సును అడ్డుకున్నారు.  ధరూర్‌ మండలం ఉప్పేర్ గ్రామంలో వర్షాని‌ సైతం లెక్క చేయకుండా నెట్టెంపాడు, నాగర్ దొడ్డి, ద్యాగదొడ్డి, మాల్ దొడ్డి‌ తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉప్పేర్ నెట్టెంపాడు ఆర్టీసి‌ బస్సును అడ్డగించారు.

 Also Read: Shadnagar Road Accident: షాద్ నగర్‌ లోఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతురు స్పాట్ డెడ్!

ఏడు గ్రామాలకు ఒకటే ఆర్టీసి బస్సు రావడం వల్ల విద్యార్థుల ప్రయాణాలకు ఇబ్బందిగా‌ మారి స్కూళ్లకు సకాలంలో వెళ్లలేక పోతున్నామని విద్యార్థులు వాపోయారు. ఆర్టీసి బస్సులు సమయపాలన పాటించకపోవడంతో ఉదయం సాయంత్రం వేళలో ఆయా గ్రామాల విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ‌నెలకొందన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని‌ అదనంగా మరో బస్సును నడపాలని ఆర్టీసి అధికారులకు పలుమార్లు విన్నపించిన ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్, ఆర్టీసి అధికారులు స్పందించి స్కూల్ వేళలో మరో బస్సును అదనంగా నడపాలని కోరారు.

మానవపాడు మండలంలోని పలు గ్రామాలకు సైతం

మనపాడు మండలంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి నాయకులు పార్టీ ఆర్టీసీ డిపో మేనేజర్ సునీతకు వినతిపత్రం సమర్పించారు. చెన్నిపాడు, గోకులపాడు, పెద్దపోతులపాడు, చిన్న పోతులపాడు, బోరవెల్లి, జల్లాపురం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని, రద్దీగా ఉండే ఉదయం,సాయంత్రం వేళలోనైనా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.

 Also Read:Private schools in Gadwal: ప్రైవేట్ బడుల్లో జోరుగా దందా.. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు