Private schools in Gadwal: గద్వాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు (Private schools) విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదు. పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, టై,బెల్టులు, ఇతర సామగ్రిని యథేచ్ఛగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏటా స్కూల్ ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయి. వివిధ రకాల ఫీజుల పేరుతో తల్లి దండ్రులపై అదనపు భారం మోపుతున్నాయి. పలు పాఠశాలలు ప్రాథమిక విద్యకే రూ.30 నుంచి రూ. 40 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని ప్రీప్రైమరీ విద్యకు సైతం రూ.30 వేలకుపైగా వసూలు చేస్తుండడం గమనార్హం.
జిల్లాలో 147 ప్రైవేట్ స్కూల్స్
జిల్లాలో 147 కు పైగా లు (Private schools) ప్రైవేట్ పాఠశాలలున్నాయి. విద్యా సంస్థలు చదువు, జ్ఞానం అందించే క్షేత్రాలుగా ఉండాలని, ఎలాంటి వ్యాపారం చేయవద్దని ప్రభుత్వ నిబంధనలున్నా అవేమీ అమలు కావడం లేదు. యాజమాన్యాలు యథేచ్చగా వ్యాపారం చేస్తున్నాయి. పాఠశాలల ఆవరణలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు, టై,బెల్టులను అమ్ముతున్నాయి. స్కూల్ పేర్లతో ముద్రించి మరీ విక్రయిస్తుండడం గమనార్హం. విద్యార్థి సంఘాల నాయకులు స్కూళ్లపై దాడులు చేసి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
విద్యాహక్కు చట్టం (Right to Education Act) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో (Private schools) అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. కానీ రూ.2 వేల నంచి రూ. 5 వేల వరకు అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ అమ్ముతున్న పాఠశాలలో విద్యార్థి సంఘాలు పి డి ఎస్ యు, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ నాయకులు బుక్స్ పేరుతో పాఠశాల యాజమాన్యాలు చేస్తున్న దోపిడీని చూపించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో లు (Private schools) వివిధ రకాల ఫీజులు బుక్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలను విద్యార్థి సంఘాలు వెలుగులోకి తెచ్చాయి.
ప్రతి లు (Private schools) ప్రైవేట్ స్కూల్ లో 25 శాతం సీట్లు పేద పిల్లలకు కేటాయించి ఉచితంగా విద్య అందించాలనే నిబంధన ఉన్నా ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. (Private schools) ప్రైవేట్ స్కూళ్లలో విద్యావ్యాపారం బహిరంగంగా జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విద్యావంతులు, ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి హరీష్, పి.డి.ఎస్ యు జిల్లా నాయకులు
జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ లు (Private schools) యజమానులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారు. పాఠశాలల్లో యథేచ్ఛగా విద్యా సామగ్రిని విక్రయిస్తున్నారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
పలు స్కూళ్లకు నోటీస్ లు ఇచ్చాం : డీఈఓ అబ్దుల్ గని
ప్రైవేట్ స్కూల్స్లో నోటు క్స్, బ్యాగులు తదితర సామగ్రి విక్రయించరాదు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. స్కూల్ నోటీస్ బోర్డులో ఫీజుల వివరాలను ఉంచాలి. అధిక ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది ఇప్పటికే పలు స్కూళ్లకు నోటీసులు ఇచ్చాం.
Also Read: Jurala Accident: జూరాల వద్ద విషాదం.. కొంపముంచిన సెల్ ఫోన్ డ్రైవింగ్