Jangaon Collector: ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన జనగామ జిల్లా కలెక్టరు రిజ్వాన్ భాషా షేక్ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ మేరకు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డును రవీంద్రభారతిలో అందుకున్నారు.
Also Read: Jangaon collector: ప్రజావాణిలో బాధితుల మొర.. సమస్యలు సత్వరమే పరిష్కరించండి!
విశేష ప్రతిభ
2025 సంవత్సరంలో జరిగిన ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి నిన్న శనివారం ప్రకటించారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎన్నికల నిర్వహణలో సిబ్బందికి శిక్షణ, సామర్థ్య పెంపు విభాగంలో ఈ అవార్డును దక్కించుకున్నారు. జనగామ జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం కు కృషి చేసిన కలెక్టర్ ను జిల్లా అధికారులు, ప్రజలు అభినందిస్తున్నారు.
Also Read: Crime News: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి

