Manjula: కొత్తగూడెం జిల్లా(Kothagudem District) కేంద్రం లోని రైటర్ బస్తి ఏరియాలో పేద కుటుంబానికి చెందిన దళిత, నేతకానీ మహిళా జాడి మంజుల గత కొంత కాలంగా గుండె, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మంజుల చిన్న తనం నుండే చాలా చురుకుగా, చదువుల్లో కూడా ముందు ఉంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. తర్వాత తల్లిదండ్రులను కోల్పోయి, అయినవారు అందరూ ఉన్నా, విద్యార్థి సంఘం పిడిఎస్యు పనిచేసి, పిఓడబ్ల్యు మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. విద్యా సంస్థలో ఏ సమస్యలున్నా, విద్యార్థుల తరఫున గాని తల్లిదండ్రులు తరఫున గాని ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా చూసుకున్నటువంటి వ్యక్తిత్వం ఆమెది.
తెలంగాణ ఉద్యమ సమయంలో
విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా మంజుల చాలా సుపరిచితురాలు. అనంతరం తెలంగాణ(Telangana) ఉద్యమ సమయంలోనే తెలంగాణ ధూమ్ ధామ్, జానపద కళాకారుడు, విద్యార్థి, ఉద్యమ కారులు కొండ జంపన్న ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రస్తుతం కొత్తగూడెంలో భర్త కొండ జంపన్నతో కలిసి ఉంటున్నారు. జంపన్న జర్నలిస్ట్‌గా కొత్తగూడెంలో పని చేస్తున్నారు. బాబు పుట్టిన తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైంది. భర్త జంపన్న, తోబుట్టువులు కలిసి చేతనైన కాడికి వైద్యం చేయిస్తున్నారు. వైద్య ఖర్చులు, మందులు భారం అవుతుండడంతో స్తోమత లేక ఎదురు చూస్తుండగా నెల క్రితం టీఎన్జీవో అధ్యక్షులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్యకు విషయం చెప్పగా వెంటనే స్పందించి హైదరాబాద్‌లో ఉన్న మహావీర్ హాస్పిటల్‌కు స్వయంగా దగ్గర ఉండి పంపించారు.
Also Read: Bhatti Vikramarka: మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రమే సర్కారు లక్ష్యం!
సాయం పొందిన మంజుల
మీడియా యూనియన్ నాయకులు, పత్రిక బృందం, స్నేహితులు చరవాణి ద్వారా ఆశ్రయించి సాయం కోరగా స్పందించిన వారు పూర్తి వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పి వారి సభ్యులందరి తరపున వైద్య ఖర్చులు, మందుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించారు. సాయం పొందిన మంజుల వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మంజుల హైదరాబాద్‌లోని మహావీర్ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. చికిత్స కోసం, పరీక్షలు, మందుల కోసం వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించిన వారు మాట్లాడుతూ తోటి ఉద్యమ మిత్రులు, శ్రేయోభిలాషులు, సామాజిక, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మానవత్వంతో స్పందించి మహిళ ఉద్యమకారురాలు మంజులని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమకు తోచినంత సాయం చేసి తమను ఆదుకోవాలని కోరారు.
Also Read: Azharuddin: అజారుద్దీన్ ఇంట్లో దొంగలుపడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారంటే?