Gadwal Police: మొసల్ దొడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ..!
Gadwal Police (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal Police: మొసల్ దొడ్డి అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ.. అందుకే చంపేశాడు..?

Gadwal Police: ఈనెల 4న గట్టు మండలం మొసల్ దొడ్డి అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. శనివారం గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గద్వాల డీఎస్పీ వై.మొగులయ్య(DSP Y. Mogulaiah) వివరాలు వెల్లడిండించారు.

అక్రమ సంబందానికి..

గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన సనక కయున్ (తిమ్మప్ప) అన్నతో మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహాము(Abrahamu)కు పరిచయం ఉండేది. ఇటీవల కయున్ అన్న మృతి చెందడంతో అతని భార్య సువార్తమ్మ(Suvarthamma)తో అబ్రహం సాహిత్యాన్ని పెంచుకోవడంపై ఇక మీదట ఇంటికి రావద్దని హెచ్చరించాడు. అక్రమ సంబందానికి కయున్ అడ్డు వస్తుండటంతో అబ్రహం పథకం ప్రకారం ముసల్ దొడ్డి గ్రామ శివారులో తిమ్మప్ప, అబ్రహంలు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో కాయున్ ను అబ్రహం రాయితో తలపై కొట్టి చంపి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున గట్టు ఎస్ఐ కెటిమల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేయగా, అందులో భాగంగా శనివారం ఉదయం నిందితుడు అబ్రహంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, గట్టు ఎస్ఐ కెటిమల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Telangana Govt: తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినెలా రూ.800 కోట్లు సేఫ్?.. ఎందుకంటే

Just In

01

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన