Sand-Mafia ( Image credit; twitter)
నార్త్ తెలంగాణ

Sand Mafia: ఆ జిల్లాలో జోరుగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని అధికారులు

Sand Mafia: అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అడ్డుకునే అధికారులు నిమ్మకు నీరు ఎత్తనట్లు వ్యవహరించడం మూలంగా అక్రమార్కులకు కాసుల పంట పండుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇసుక అక్రమ దందా మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు ఒక పర్మిషన్ పదుల సంఖ్యలో దండుకునేవారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంతో అక్రమ ఇసుక దందా చేసే వ్యాపారం లక్షలు దండుకుంటున్నారు. అక్రమ ఇసుక దందాతో అడ్డగోలుగా లక్షల్లో దండుకుంటున్న సంబంధిత అధికారులు మాత్రం మొద్దు నిద్ర నటించడం పట్ల మండలంలోని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Sand Mafia In Medchal: కీసరలో యథేచ్చగా సాగుతున్న అక్రమ దందా.. కోట్లలలోనే అక్రమాలు?

అక్రమార్కులు ప్రజల నుండి అధిక మొత్తంలో సొమ్ము

అధికారుల అలసత్వం ఫలితంగా ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీతుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియాను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లు ఉండడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మూసి నుండి ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు ప్రజల నుండి అధిక మొత్తంలో సొమ్ములు దండుకుంటున్నారు. గతంలో రాత్రి వేళలో అతివేగంగా ఇసుక ట్రాక్టర్లు నడపడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి వేళ ఇసుక ట్రాక్టర్ల వల్ల ప్రతిరోజు దాదాపు 40 నుండి 50 పైగా ట్రాక్టర్లో మూసి నుండి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఎక్కడ చూసినా అక్రమ ఇసుక డంపింగ్ లు దర్శనం ఇస్తున్న మండలాధికారులు మాత్రం ఇవేమీ కనిపించకపోవడం మండల ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది.ఇసుక తరలింపు కేవలం ఉదయం ఉన్నప్పటికీ రాత్రి వేళలో యదేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు.

అక్రమ ఇసుక దందా

దీనితో అక్రమార్కుల నుండి సంబంధిత అధికారులకు ఆమ్యామ్యాలు అందుతున్నాయని అనుమానంలో బలం చేకూరుతుంది. మూసి నుండి అక్రమంగా ట్రాక్టర్లతో ఇసుక దందా కొనసాగుతుంటే మూడు ట్రిప్పులకు పర్మిషన్ తీసుకుని 10 నుండి 15 ట్రిప్పుల వరకు ఒక్కో ట్రాక్టర్ ఇసుకను తరలించకపోతున్న అధికారులు పట్టించుకోవడంలేదు. అక్రమ ఇసుక దందా యదేచ్చగా సాగుతూ ప్రజాధనాన్ని అందిన కాడికి దోచుకుంటున్న సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం అడ్డుకునేందుకు వెనకడుగు వేస్తూ యజమానుల నుండి అధికారులకు ఒక్కో ట్రాక్టర్ కు రోజుకు 1000 నుండి 1500 వరకు అందుతున్నాయని అందుకే యదేచ్చగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పట్టించుకోవడంలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

పట్టించుకోని అధికారులు

అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఈ వ్యవహారం అంతా అధికారులకు కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా ఇసుక ట్రాక్టర్లు పట్టుకోవడం తర్వాత పైరవీలు చేయగానే వాటిని వదిలేస్తుండడంతో అక్రమార్కులు తమకేమీ కాదులే అనే ధీమాతో తమ పని తాము చేసుకుపోతున్నారు. పట్టించుకోని అధికారులు అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు తమకేమీ పట్టనట్టు వివరిస్తూ ఉండడం గమనార్హం. అక్రమ ఇసుక రవాణాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరించడం భౌతిక దాడులకు దిగడంతో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోలేక ఎవరికీ చెప్పుకోవాలో అని చూస్తూ ఉండిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వలిగొండ, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక మాఫియా ఆగడాలపై దృష్టి సారించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇటుక ధరలకు నియంత్రణ ఎక్కడ

ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకు ఇటుక అందించాలని అధికారులు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టిన వ్యాపారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. గతంలో నాలుగు ఐదు రూపాయలు ఉన్న ఇటుక ధరను 10 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు చెప్పిన పట్టించుకోకపోవడం గమనార్హం. అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రత్యేక సమీక్షలు ఏమైపోయే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు అతి తక్కువ ధరలకు ఇటుక, స్టీల్, సిమెంట్ అందించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీర రెడ్డి, భాస్కర్ రావు,ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి లు వివిధ మండల ఎమ్మార్వోలకు , ఎంపీడీవోలకు , స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసి ప్రత్యేకంగా వ్యాపారస్తులతో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. పేరుకే వ్యాపారస్తులతో సమావేశాలు నిర్వహించినట్లు కనిపిస్తుంది. ఇటుక, ఇసుక వ్యాపారులు వినిపించుకోవడంలేదని స్వయంగా ఎమ్మార్వోలు చెప్పడం గమనార్హం.

జోరుగా ఇసుక దందా

ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుకను తరలింపు అక్రమ ఇసుక వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది.. ఇందిరమ్మ లబ్ధిదారుల పేర్లతో పర్మిషన్ తీసుకొని దాదాపు విచ్చలవిడిగా ఇతరులకు 8000 వరకు ఒక్కో ట్రాక్టర్ ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వీరిని కట్టడి చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: Sand Mafia: యథేచ్చగా ఫిల్టర్ ఇసుక దందా.. దృష్టి సారించని అధికారులు..

Just In

01

Medak Bribe Case: రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ట్రాన్స్‌కో డీఈ..

Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్‌మీట్.. ఏంటీ వ్యవహారం?

Woman Farmer: చేతులు పట్టుకొని భోరున ఏడ్చిన మహిళా రైతు.. చలించిపోయిన మంత్రి పొన్నం!

Mahakali: ‘మహాకాళి’గా ఎవరంటే.. ఫస్ట్ లుక్ అరాచకం!

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ సీరియస్!.. కారణం ఏంటో తెలుసా?