Sand Mafia In Medchal [ Iimage credit : swetcha reporter]
తెలంగాణ

Sand Mafia In Medchal: కీసరలో యథేచ్చగా సాగుతున్న అక్రమ దందా.. కోట్లలలోనే అక్రమాలు?

 Sand Mafia In Medchal: ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూముల్లో అక్రమ దందాను సాగిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తూ..ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా రూ.కోట్లు సంపాదిస్తున్నారు. మట్టి మాఫియా పెట్రేగిపోతుండడంతో అక్రమ మట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. అక్రమ తంతును అడ్డుకోవాల్సిన పోలీసులు, రెవిన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర పట్టణ సమీపంలో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని ఎదరిస్తే..దాడులు చేసేందుకు సైతం మట్టి మాఫియా వెనుకాడడం లేదు.

కనుమరుగై పోతున్న ప్రకృతి సంపద

ఒకప్పుడు పచ్చనిచెట్లు, ఎర్రని మట్టి దిబ్బలతో ఆహ్లాదంగా ఉండే కీసరగుట్టలోని కొండ క్రమక్రమంగా కనుమరుగై పోతోంది. కొంతమంది వ్యక్తుల ధనదాహం కారణంగా ఇప్పటికే కొండ తన స్వరూపాన్నే కోల్పోయింది. అనుమతుల్లేకుండా లేకుండా మట్టి కోసం తవ్వకాలు చేపట్టి..ఏకంగా ఈ ప్రాంతాన్ని గుల్ల చేసేశారు. నిత్యం వందల సంఖ్యలో లారీలలో మట్టిని తరలిస్తున్నారు. కొందరు స్థానిక నాయకులు ఈ అక్రమ తంతులో భాగస్వాములై లక్షలాది రూపాయలను జేబులో వేసుకుంటున్నారు.

దమ్మాయిగూడ మున్సిపాలిటి పరిధిలోని కీసర పట్టణానికి సమీపంలోని రోబో సాండ్‌ క్రషర్‌ మిల్లు వెనకాల ఉన్న కొండపై ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. సర్వే నంబర్లు 431, 396, 397, 398లలోని 76 ఎకరాల్లో కొండ చుట్టూత పోరంబోకు భూమి ఉంది. దీనికి అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో అటవీశాఖ నీలగిరి,ఆకేసు చెట్లు పెంచుతోంది. కొంత పోరంబోకు భూమిని ప్రభుత్వం అసైన్డ్ చేసి సాగు కోసం రైతులకు పంపిణీ చేసింది. రైతులకు సంబంధించిన ఈ భూముల్లోనూ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.

District Collector Muzammil Khan: అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ పిలుపు

మట్టిని తీయాలనుకుంటే గనుల శాఖ, మున్సిపల్‌ లేకుంటే పంచాయతీ అనుమతులు తప్పక తీసుకోవాలి. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా వందలాది లారీలలో ఈ కొండపైన ఉన్న మట్టిని తరలించుకుపోతున్నారు. తవ్వకాలకు గుర్తుగా 50 అడుగులలో పెద్ద పెద్ద గుంతలు సైతం ఏర్పడ్డాయి. రాత్రిపూట భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడం..లారీలలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నప్పటికీ పోలీసులు, రెవిన్యూ అధికారులు కానీ.. పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీని వెనుక పెద్ద ముఠానే ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
ఈ ప్రాంతంలో మట్టికి ఉన్న విపరీతమైన డిమాండ్‌ను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పరిశ్రమలు, గృహ నిర్మాణాలకుగాను మట్టికి భారీగా గిరాకీ ఉంది. దీంతో అక్రమార్కులు అనుమతులు ఉన్నాయని చెబుతూ కొండపై తవ్వకాలు చేపట్టి మట్టిని తోడేస్తున్నారు. లారీ లోడు మట్టిని రూ.4500 వరకు విక్రయిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాల విషయాన్ని తహసిల్దార్‌ కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ, మైనింగ్‌, విజిలెన్స్​‍ అధికారులు దృష్టి సారించకపోతే కొండ కనుమరుగు కావడం ఖాయమని పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Ponguleti srinivas reddy: రైతన్నలు ఆందోళన చెందవద్దు.. మంత్రి పొంగులేటి

చర్యలు తీసుకుంటాం  అశోక్‌, కీసర తహసిల్దార్‌
మట్టి తవ్వకాలపై గతంలో క్రిమినల్‌ కేసులు పెట్టాము. ఈ మధ్యకాలంలో మళ్లీ కొండపై అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సిబ్బందిని అప్రమత్తం చేశాం. పూర్తిస్థాయిలో పరిశీలించి బాధ్యులపై అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెడతాం. అక్రమ తవ్వకాల్లో ఎంతటి వారున్నా.. ఎవరినీ ఉపేక్షించేది లేదు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!