తెలంగాణ

District Collector Muzammil Khan: అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ పిలుపు

District Collector Muzammil Khan:  అమ్మాయి పుడితే ఇంటిల్లిపాది పండగ చేసుకోవాలనీ, అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే ఆడపిల్లలు పుడతారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.ఆడపిల్లలు జన్మించిన తల్లిదండ్రులు భారంలా కాకుండా వరంలా భావించాలని, ఆడపిల్ల పుట్టడం అదృష్టమన్నారు.ఇటీవల కలెక్టర్ మా పాప – మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించడం తెలిసిందే,ఇందులో భాగంగా కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామంలోని ఉండేటి అమృత సుధాకర్ దంపతులకు ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసి, వారి ఇంటికి గురువారం నాడు జిల్లా కలెక్టర్ వెళ్లి పాప తల్లిదండ్రులతో పాటు అత్తా, మామలను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ, మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా విద్య, వ్యాపార, ఆస్తి, అవకాశాలలో భాగం కల్పించాలన్నారు. అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, మంచి విద్య, ఇతర ప్రాంతాలకు వెళ్లి ఏదైనా సాధించేందుకు అవకాశం, ప్రోత్సాహకాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.అమ్మాయి ఆశించిన మేరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడి సొంత ఆదాయ వనరులు సంపాదించుకున్న తర్వాత మాత్రమే పెళ్ళి గురించి ఆలోచించాలని, ఆడపిల్లల భావాలకు గౌరవం ఇవ్వాలని తెలిపారు.

 Also Read: Suryapet: వామ్మో..మహిళ కడుపులో అంత పెద్ద కణితి.. తొలగించిన వైద్యులు

పురుషుల మధ్య వ్యత్యాసం సమాజంలో తొలగించాలని, అమ్మాయి పుడితే అదృష్టంగా భావించాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇచ్చి, మంచి సందేశం అందించాలని, మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలిపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల్లో జన్మించిన ఆడపిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జిల్లా అధికారులు స్వీట్ బాక్స్, సర్టిఫికేట్ అందించి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ పి. సునీత, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి డా. బి. పురంధర్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు జి. శివప్రసాద్,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!