Mahabubabad: మహబూబాబాద్ ఆర్టీవో ఆఫీసులో ఆ ప్రైవేట్ వ్యక్తే కీలకం. మహబూబాబాద్ జిల్లాకు ముందు నుంచే ఆయన డ్రైవర్గా పనిచేశారు. ఆ తర్వాత “లక్ష్మీ”రాం చాకచక్యాన్ని గమనించిన డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి కంప్యూటర్ ఆపరేటర్ గా నియమించుకున్నాడు. డ్రైవర్గా పనిచేసినప్పటికీ వసూళ్లలో లౌక్యాన్ని ప్రదర్శించిన లక్ష్మీరాం ఆపరేటర్ గాను కొనసాగుతూ వసూళ్లు చేయడంలో ఆరితేరాడు. ఇంకేముంది జిల్లా రవాణా శాఖ అధికారి ఎవరు వచ్చిన లక్ష్మీ రామ్ ను కలెక్షన్ కింగ్ గా నియమించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అవినీతికి సంబంధించిన వసూళ్ళ బాధ్యత మొత్తం ఆయనకు అప్పగించడమే ఆనవాయితీగా సాగుతోంది.
ఏజెంట్లు అందరూ రాజాకు ఇవ్వాలి
ఆర్టీవో కార్యాలయానికి అనుసంధానంగా వివిధ లైసెన్సుల కోసం కన్సల్టెంట్లను ఏజెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. మీరందరూ ఒక్కో లైసెన్స్ కు ఒక్కో విధంగా డిటిఓ కార్యాలయానికి ముడుపులు చెల్లించేందుకు ఓ రేటును ఖరారు చేసుకున్నారు. అందులో భాగంగా ఈ లైసెన్స్ కోసం వినియోగదారులు వచ్చిన వారి కన్సల్టెంట్ రూముల్లో ఆన్లైన్లో ఆర్జీ చేసుకున్నాక, వారి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ చాలాన్ తో పాటు డిపిఓ కార్యాలయంలో సంబంధిత అధికారులకు ఇచ్చే డబ్బులను సైతం కలెక్షన్ చేసుకుని లైసెన్స్ కోసం ఆఫీసుకు వినియోగదారులను పంపిస్తారు. అక్కడ ఏజెంట్లు తీసిన రెండు జతల జిరాక్స్లు ఉంటేనే ఆఫీసులో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ లు రిజిస్టర్ లో ఎంట్రీ చేసి సంబంధిత అధికారి వద్దకు పంపిస్తారు. రెండు జతల జిరాక్స్ లేకపోతే ఏజెంట్ పంపలేదని బండ గుర్తు అన్న మాట. దీంతో వినియోగదారుడు ఏం చేయాలో తోచక అయోమయానికి గురవుతాడు. ఇది గమనించిన అక్కడే ఓ ప్రైవేట్ వ్యక్తి మీరందరిని చేరువ చేసుకొని ఆయన ప్రోత్సాహంతో మళ్లీ కలెక్షన్స్ వసూళ్లు చేసి సంబంధిత అధికారికి పంపి సమస్యకు పరిష్కారం చూపుతారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇక కలెక్షన్ కింగ్ లక్ష్మీరాం ది మరొక ఎత్తు.
లక్ష్మీ రామ్ చేతుల మీదుగానే డిటిఓకు ముడుపులు
డిటిఓ కార్యాలయానికి అనుసంధానంగా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్స్ కన్సల్టెన్సీ నుంచి రావాల్సిన అక్రమ డబ్బులు మొత్తం అదే ఆఫీసులో పనిచేసే ప్రైవేట్ వ్యక్తి రాజాకు అప్పగిస్తారు. రాజా నుంచి నేరుగా లక్ష్మీరాం వద్దకు అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మొత్తం చేరుకుంటాయి. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి వచ్చే జిల్లా రవాణా శాఖ అధికారికి అప్పటివరకు వసూలు అయిన అక్రమ సొమ్మునంత అప్పగిస్తాడు. ఈ తంతు జిల్లా ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతూనే ఉంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి ఏ అధికారి వచ్చిన కలెక్షన్ కింగ్ లక్ష్మీరాం మాత్రమే అధికారులకు అక్రమ లావాదేవీల్లో కీలకంగా వ్యవహరిస్తుంటాడు.
Also Rrad: Warangal Traffic Police: ట్రాఫిక్ పోలీసుల నయా దందా.. అక్రమాలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం!
ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న డోంట్ కేర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యంగా రవాణా శాఖ కార్యాలయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న డిటిఓ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసేందుకు ప్రణాళిక రచించారు. అదే సమయంలో ఇక్కడ పని చేస్తున్న జిల్లా రవాణా శాఖ ఇంచార్జి అధికారి గౌస్ పాషా పై గతంలో వచ్చిన ఆరోపణ నేపథ్యం, అదేవిధంగా లక్ష్మీరాం సైతం ఏసీబీ అధికారులకు ఉప్పందించి దాడులు నిర్వహించేందుకు దోహదపడ్డాడని ఆరోపణలు సైతం ఉన్నాయి. ఏసీబీ దాడుల అనంతరం సస్పెండ్ అయిన గౌస్ పాషా స్థానంలో ఫుల్ అడిషనల్ చార్జి జిల్లా రవాణా శాఖ అధికారిగా వచ్చిన ప్రస్తుత అధికారికి లక్ష్మీరాం ఫుల్ సపోర్టుగా పనిచేస్తూ అక్రమ వసూళ్లను అందజేసేందుకు కృషి చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న ఐ డోంట్ కేర్ అనే కోణంలో లక్ష్మీరాం పనిచేస్తున్నాడని స్వయంగా రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.
సందులో సడే మియా లాగా “సాయి” శరణం
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడుల అనంతరం ఇంచార్జి అధికారులకు విధుల బాధ్యతను ఆ శాఖ డిటిసి అప్పగించారు. ఇక ఈ సమయంలోనే సందులో సడే మియా లాగా “సాయి” శరణం వ్యవహరిస్తుండడంతో పలు విమర్శలకు తావిస్తోంది. వారం, 15 రోజులు, నెల రోజులకు ఒకసారి వచ్చే ఇన్చార్జి రవాణా శాఖ అధికారి లేని సమయంలో అంతా తానే అక్రమ వసూళ్ల పర్వానికి దిగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ అధికారి స్థాయిలో పనిచేసిన వారు ఎన్నడూ కూడా ఇంత పెద్ద అక్రమ వసూళ్లకు పాల్పడలేదని ఉంది. సాయి శరణం వచ్చినప్పటి నుంచి స్వయంగా కార్యాలయంలో పనిచేసే సిబ్బందికే నచ్చకపోవడం గమనార్హం. “సాయి” శరణం ఈ కార్యాలయం నుంచి ట్రాన్స్ఫర్ లేదా సస్పెండ్ అయితేనే తమకు విధులు నిర్వహించుకోవడానికి ప్రశాంతంగా ఉంటుందని సిబ్బంది ఆరోపించడం మరొక విశేషం. అయితే మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అక్రమ వసూళ్ల కు సంబంధించి మళ్లీ ఏసీబీ అధికారులు నజర్ వేస్తారా? అధికారుల అక్రమాల భరతం పడతారా? చూడాలి.
Also Read: Congress on KTR: కేటీఆర్ కు పైసల బలుపు.. సీఎం ను విమర్శిస్తే ఊరుకోం ఎమ్మెల్యే కామెంట్స్!
