Singaram Gram Panchayat: మున్సిపాలిటీ, సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని కోట్ల రూపాయల ప్రజాధనంతో చేప ట్టిన కట్టు వాగు, మేట్ట వాగు, కొడి పుంజుల వాగు పూడిక తీత పనులలో అనేక అక్రమాలు నెల కొన్నాయని, దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని, సామాజిక కార్యకర్త, న్యాయవాది కన్నె రవి కోరారు. ఆయన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత వర్షాకాలం వరదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మండలంలోని, కట్టు వాగు,మేట్ట వాగు, కొడిపుజ్జుల వాగు పూడిక తీత పనుల కోసం సింగరేణి (CSR) నిధులనుండి రూ. 83 లక్షలను కేటాయించగా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ తూ తూ మంత్రంగా పనులను చక్క బెడుతూ కేవలం బిల్లులు,కమీ షన్ల ఫై రాఆటం చూపుతున్నారని, పనులలో మాత్రం నాణ్యత పారద ర్శకం లేదన్నారు.
ఇందుకు ఉదాహరణ అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాగులపై చేపట్టిన పనులను పరిశీలిస్తే అర్థమవుతుందన్నా రు. గత 2022 నుంచి 2025 వరకు కట్టు వాగు మేట్ట వాగు కొడి పుంజ్జుల వాగు పూడిక పనుల కోసం ప్రభుత్వం నిధు లను కేటాయించిన కేవలం కాంట్రాక్టర్లు జేబు నింపు కోవడానికి ఆ నిధులు పనికొస్తున్నాయన్నారు.
Also Read: Bandi Sanjay on KCR: ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్ జల్సాలు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!
ప్రజలకు మాత్రం వరదల నుండి కష్టాలు తప్పడం లేదన్నారు. గత మూడు సంవత్సరాల నుండి సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుండి రూ.1,069000 కేటాయించగా, ఆ పనులన్నీ ఎమ్మెల్యే (MLA) బినామీ కాంట్రాక్టర్లు దక్కించుకొని నాసిర కంగా పనులను చేసి బిల్లులు పొందారని ఆరోపించారు. ఆ నిధులతో వాగులపై శాశ్వత పనులను చేపట్టవచునన్నారు. వాగులఫై ప్రతి సంవత్సరం పూడికతీత పనులు కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులుగా మారాయన్నారు. వాగులపై అభివృద్ధి పనుల కోసం ఈ సంవత్సరం కూడా హడా వుడిగా ఎమ్మెల్యే శంకుస్థాపన చేయటంతో కాంటాక్ట్ పనులు దక్కించుకున్న బినామీ కాంట్రా క్టర్ అవినీతితో చేసిన పనులు మూడునల్లా ముచ్చటగా మారాయన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధం
ఎక్కడ చూసినా చెత్త చెదారంతో కాలవలు దర్శనమిస్తున్నాయని, ఎమ్మెల్యే గారు ఇదేనా మీరు చేసే కోట్ల రూపాయల అభివృద్ధి అని, ప్రశ్నించారు. కళ్ళతో ఎవరు చూసినా కాంట్రా క్టర్ చేసిన పనుల అభివృద్ధి ఏమిటో కనిపిస్తుందని తెలిపా రు. వాగుల పనుల అక్రమాలను, బహిరంగంగా ప్రజల ముందు నిరూపించేందుకు తాను సిద్ధమని, లేదా అభివృద్ధి పనులు సక్రమంగా జరిగాయని తెలిపేందుకు, ఎమ్మెల్యేగాని, ఆయన అనుచరులు గాని ముందుకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధమని, సవాలు విసిరారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ప్రత్యేక దృష్టి సారించి, వాగు పనులలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ నుండి ప్రజాధనాన్ని రికవరీచేసి, ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఆంతర్యం ఏమిటి.. ?
లేనిచో తెలంగాణ హైకోర్టులో ప్రజావాజ్యం దాఖలు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజా ఆమోదం లేకుండా స్థానిక ఎమ్మెల్యే మణుగూరు పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి నేడు మున్సిపాలిటిని తిరిగి గ్రామ పంచాయతీగా మార్చాలి అనడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. కేవలం తన అనుచరుల కాంట్రాక్ట్ పనుల కోసమేనా అని ధ్వజమెత్తారు. 2005లో ఏర్పడిన మున్సిపాలి టీలో ప్రజలు అభివృద్ధి చెందలేదని, కేవలం మాజీ ఎమ్మెల్యే, ఆయన బినామీ కాంట్రాక్టర్, ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన బినామీ కాంట్రాక్టర్లే అభివృద్ధి చెందారే తప్ప ప్రజల అభివృద్ధి ఎక్కడ వేసిన గోంగలి అక్కడే అన్నచందంగా మారిందన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో వాగులపై పూ డికతీత పనులపై కమిషనరే అసహనం వ్యక్తం చేశారని, పనులు పారదర్శకంగా జరిపించాలంటూ ఇరిగేషన్ శాఖ ఈఈకి లేఖ రాశారని, చేప్పారు. కమిషన్ల కోసం పనిచేసే బినామీలను పక్కనపెట్టి, ప్రజా ప్రయోజనం కోసం కట్టు వాగు, మేట్ట వాగు, కొడిపుజ్జుల వాగు పూడిక తీత పనులను చేపట్టే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
Also Read: Warangal Suicide Case: డాక్టర్ ప్రత్యూష మృతికి కారణం వాళ్లే.. నలుగురి అరెస్ట్