Uttam Kumar Reddy ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Uttam Kumar Reddy: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో 75000 మందికి ఉద్యోగ అవకాశాలు!

Uttam Kumar Reddy: హుజూర్నగర్ జాబ్ మేళా భారతదేశం లోనే అరుదైన కార్యక్రమం అని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. సుమారు 275 కంపెనీలు హుజూర్నగర్ కు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పేరుపొందిన కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరయ్యాయని తెలిపారు.శనివారం అయన సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళా ప్రారంభించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మెగా జాబ్ మేళాకు రావాల్సిందిగా తాను స్వయంగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం జరిగిందని ,ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విస్తృత ప్రచారం కల్పించామని, అందుకు తగ్గట్టుగానే భారీ స్పందన వచ్చిందని, ఇందుకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Mega Job Mela: నిరుద్యోగులకు పోలీసులు భరోసా.. రూ.30 వేలకు పైగా జీతంతో మెగా జాబ్ మేళా!

75000 మందికి ఉద్యోగ అవకాశాలు

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న విషయం పై ప్రత్యేక శ్రద్ధ వహించిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పోస్టులు నింపాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, అందులో భాగంగానే పబ్లిక్ అండర్ టేకింగ్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా 20 నెలల కాలంలో 75000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే,ఈ జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ రంగంలో సైతం పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో జాబ్ మేళా నిర్వహించామనితెలిపారు.గ్రామీణ ప్రాంతంలో సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, తెలుగు మీడియం లో చదవడం వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అవకాశాలు తక్కువగా ఉంటాయని, ప్రత్యేకించి తండాలు, హరిజన ,గిరిజన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు.

275 కంపెనీలు, 40 వేల మందికి ఇంటర్వ్యూలు

ఈ జాబ్ మేళా ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం దొరికిందని, ఇలాంటి జాబ్ మేళాల ద్వారా ప్రజల జీవితాల్లో సమూల మార్పులను తీసుకురావచ్చని, ఉద్యోగాలు కల్పించడం ద్వారా కుటుంబాలు బాగుపడతాయని ఆయన అన్నారు. జాబ్ మేళాను విజయవంతం చేయడంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎక్స్చంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్, జిల్లా యంత్రాంగం, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రం గాలు, సహకరించిన అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 275 కంపెనీలు, 40 వేల మందికి ఇంటర్వ్యూలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని ,తమ ప్రభుత్వం ప్రైవేటు ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు చేస్తున్న కృషికి ఇది నిదర్శనం అని అన్నారు.ఇంటర్వ్యూలకు హాజరైన వారు ఉద్యోగాల్లో చేరేవరకు తాము నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సర్వోత్తమ్ రెడ్డి ,తదితరులు ఉన్నారు.

Also Read: Mega Job Mela: మెగా జాబ్ మేళా.. 11,000 ఉద్యోగాల అవకాశాలు!

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..