Praveen on Koushik Reddy (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Praveen on Koushik Reddy: ప్రజాసేవ మరిచి రీల్స్ తీస్తూ కాలక్షేపం.. వొడితల ప్రణవ్

Praveen on Koushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) ప్రజాసేవ మరిచి రీల్స్ తీస్తూ కాలక్షేపం చేస్తున్నాడని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ ఆరోపించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నియోజకవర్గానికి ఐరన్ లెగ్ గా మారాడని త్వరలో కౌశిక్ రెడ్డి బీజేపీ(BJP)లో చేరతాడని ప్రణవ్ జోస్యం చెప్పారు.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ రూ.8.47 లక్షల విలువైన 26 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్కుల పంపిణీలో పేదల ఆర్తనాదాన్ని రాజకీయం చేయడం తగదని ఒక ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని మండిపడ్డారు.

పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు
కళ్యాణలక్ష్మి(Kalyanalakshmi), సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులు ఆలస్యం చేస్తున్నారని కాలం చెల్లిన చెక్కులు పంపిణీ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. చెక్కులు వాయిదా పడిన వారికి త్వరలోనే రీ-వాలిడేషన్ చేసి అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Homes) మంజూరు చేస్తున్నామని సాంకేతిక కారణాల వలన నిలిచినవారికీ తక్షణమే ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ నిబంధనల మేరకు అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలియజేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లా పని చేస్తున్నామని గ్రూపులకి తావు లేదని పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించారు.

Also Read: BJP on Hydraa: ఫాతిమా కాలేజీని వదిలిపెట్టని కమలం పార్టీ..

చెక్కులతొ రాజకీయ ప్రయోజనాలా
ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ ఇన్‌చార్జిగా తనను సంప్రదించాలని కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ(Congress) పాపులారిటీ పెరుగుతున్నదానికి నిదర్శనమని ప్రజా పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే కొందరికి అసహనం కలుగుతోందని పేర్కొన్నారు. పేదలకు ఇవ్వాల్సిన చెక్కులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దారుణమని మండిపడ్డారు నిలిచిన చెక్కులను త్వరలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి, నాయకులు రవీందర్ బాలసాని రమేష్ గౌడ్, శ్రీకాంత్ ,రాజిరెడ్డి, రమేష్ ,బిక్షపతి పాల్గొన్నారు.

Also Read: Raja Singh: ఆయన కారణంగానే రాజీనామా చేశా.. రాజాసింగ్

 

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం