Pranav on Kaushik Reddy: బండి ట్రాప్‌లో ఈటల రాజేందర్, ఈటల రాజేందర్(Etela Rajender) ట్రాప్‌లో బండి పడలేదు కానీ బీజేపీ ట్రాప్‌లో పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) పడుతున్నాడనీ కాంగ్రెస్(Congress) హుజురాబాద్ ఇంచార్జీ ఓడితెల ప్రణవ్ బాబు(Odithela Pranav Babu) అన్నారు. హుజురాబాద్(Huzurabad) పట్టణంలోని బస్ స్టాండ్ ఆవరణలో మహాలక్ష్మీ(Mahalaxmi) పథకం విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్ బాబు మీడియాతో మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలకు ఉచిత టికెట్‌లను ఇచ్చామని,6,800 కోట్ల ప్రయాణ చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని, ఇదొక చరిత్ర అని అన్నారు.
హుజురాబాద్ డిపో పరిధిలో దాదాపు 1,34,02,821 మందికి సుమారు 53 కోట్లు ప్రయాణ ఛార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్(BRS) పదేళ్లలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో చేసి చూపెట్టింది అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, విమర్శించనవారే కితాబు ఇస్తున్నారని అన్నారు. మహిళలను ఆర్థికంగా చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మహిళా సంఘాలకు బస్ నడుపుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం నుండి కల్పించామని అన్నారు. విజయవంతంగా పథకాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
దళిత బంధు ఆపిందే కౌశిక్ రెడ్డి
దళిత బంధు విషయంలో కౌశిక్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని, ఉప ఎన్నికల సమయంలో ప్రారంభమైన దళిత బంధు పథకం హుజురాబాద్(Huzurabad) నియోజకవర్గంలో అందరికి ఇవ్వకుండా కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) కుట్రలు చేశారని అన్నారు. ప్రభుత్వ విప్‌గా, ఎమ్మెల్సీ(MLC)గా ఉండి ఆనాడు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని అన్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం వారిని వాడుకున్నారే తప్ప వారి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోపే దళిత సంఘాల నాయకులకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్యపై పలు దఫాలు చర్చించగా గత జనవరిలో ఫ్రీజింగ్ ఎత్తివేశామని, ప్రభుత్వంలో ఉండి చేయలేక ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తుంటే కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని, దళితులు ఎవరు అధైర్యపడిద్దని, ఆలస్యమైన అర్హులైన ప్రతి లబ్దిదారునికి దళిత బంధు నిధులు అందజేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని అని అన్నారు.
Also Read: KTR: బీసీ డిక్లరేషన్ అడుగడుగునా మోసమే.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!
పథకాలను అందజేసేలా కృషి
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి మింగుడు పడడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇళ్ళు అయినా హుజురాబాద్ పేద ప్రజలకు ఇచ్చాడా అని ప్రశ్నించారు? కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పంచలేదని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో 3500 ఇళ్లను మొదటి విడతగా అందజేశామని, బేస్మెంట్ వరకు పూర్తైన ఇళ్లకు డబ్బులు కూడా పడ్డాయని, మొదటి కౌశిక్ రెడ్డి కళ్ళు పెద్దగా చేసి చూస్తే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కనిపిస్తాయని అన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందిస్తామనిన అన్నారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో జెండా ఎగరేస్తాం
బీజేపీ నాయకులు బండి సంజయ్(Bandi Sanjay), ఈటల రాజేందర్(Etela Rajender) మధ్య జరుగుతున్న అంతర్గత పార్టీ విషయాల్లో కౌశిక్ రెడ్డి దూరడం చూస్తే బీజేపీ ట్రాప్‌లో కౌశిక్ రెడ్డి పడుతున్నాడని అందుకే బండి సంజయ్‌కు మద్దతుగా మాట్లాడుతు న్నాడని ప్రణవ్ ఆరోపించారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) దొందూ దొందే అని ఎలక్షన్ నుండి చెప్తున్న అని ఇప్పుడు కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మాట్లాడడం చూస్తుంటే నిజమని తెలుస్తుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 మండలాల్లో, 2 పట్టణాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అన్నారు. హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందనీ ధీమా వ్యక్తం చేశారు.
ఆశయాలను కొనసాగిస్తామ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత ఎంపీ వొడితల రాజేశ్వరరావు 14వ వర్ధంతిని హుజురాబాద్(Huzurabad) పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మనవడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వోడితల ప్రణవ్ మాట్లాడుతూ, రాజేశ్వరరావు రాజ్యసభ సభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా దేశానికి, ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వారి బాటలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ప్రణవ్ తెలిపారు.
పేద కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యకు దూరం కావొద్దని రాజేశ్వరరావు ఆశయంగా పెట్టుకున్నారని ప్రణవ్ గుర్తు చేశారు. నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు చేదోడు వాదోడుగా ఉండి, ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తనవంతు సహాయం అందించి రాజకీయ చతురత ప్రదర్శించారని ప్రణవ్ పేర్కొన్నారు. తన తాత ఆశయాలను కొనసాగిస్తూ విద్య, వైద్య రంగాల్లో పేద ప్రజలకు మరింత సేవ చేస్తానని ప్రణవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్(Huzurabad), జమ్మికుంట, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, రాజేశ్వరరావు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: Fisherman Missing: మానుకోట జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు
