Warangal job mela: వరంగల్ జాబ్ మేళాలో వారికి జాబ్స్ పక్కా!
Warangal job mela (Image Source: AI)
నార్త్ తెలంగాణ

Warangal Job Mela: వరంగల్ జాబ్ మేళాపై కీలక అప్ డేట్.. వారికి జాబ్స్ పక్కా!

Warangal Job Mela: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt).. వరంగల్ లో మెగా జాబ్ మేళా (Warangal Job Mela)ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు భారీగా అక్కడికి పోటెత్తారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఈ జాబ్ మేళాను ప్రారంభించగా ఒక్కసారిగా నిరుద్యోగులు హాల్ లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి పలువురు కింద పడిపోయారు. దీంతో ముగ్గురు యువతులకు గాయాలయ్యాయి.

11 వేల ఉద్యోగాలు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్‌ హాలు (MK Naidu Convention Hall)లో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), సీతక్క (Seethakka) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 60 కంపెనీల ద్వారా 11 వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో ఆ ప్రకటన యువతలోకి బాగా చేరింది. దీంతో ఎలాగైన కొలువును సాధించాలన్న లక్ష్యంతో వారంతా జాబ్ మేళా జరుగుతున్న ప్రాంతానికి పోటెత్తారు.

Also Read: Pastor Praveen’s death: పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త షాకింగ్ నిజాలు.. క్లియర్ కట్ గా చెప్పేశారుగా!

వీడియోలు వైరల్
వాస్తవానికి శుక్రవారం ఈ జాబ్ మేళా జరిగినప్పటికీ.. భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరైన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఉద్యోగం కోసం నిరుద్యోగులు పడుతున్న పాట్లు నెటిజన్లను కలిచి వేస్తున్నాయి. ఒక్క నియోజక పరిధిలోనే ఇంతమంది యువత.. ఉద్యోగం లేకుండా ఉన్నారా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంత మంది ఉంటారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం కోసం కింద మీద పడుతూ అక్కడికి వచ్చిన వారికి ఆఫర్ లెటర్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.

ఫైనల్ రౌండ్ కు
ఇదిలా ఉంటే వరంగల్ లో జరిగిన జాబ్ మేళాకు మెుత్తం 23,238 మంది నిరుద్యోగులు హజరైనట్లు మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. 5,631 మందికి వెంటనే నియామక పత్రాలను అందజేసినట్లు చెప్పారు. 18 వేల మంది నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలో రిజిస్టర్ చేయించుకున్నారని.. 9046 మంది నిరుద్యోగులు ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయినట్లు చెప్పారు. ఫైనల్ రౌండ్ కు దూసుకెళ్లిన ప్రతీ ఒక్కరికి ఉద్యోగం రావాలని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.

Just In

01

Bigg Boss9 Telugu: రీతూ వెళ్లిపోయాకా డీమాన్ పవన్ పరిస్థితి ఎలా ఉందంటే?.. భరణికి నచ్చనిదెవరంటే?

Pakistan Spy: ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ అరెస్ట్.. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తింపు!

CPI Narayana: ఐబొమ్మ రవి జైల్లో ఉంటే.. అఖండ-2 పైరసీ ఎలా వచ్చింది.. సీపీఐ నారాయణ సూటి ప్రశ్న

Lancet Study: ఏజెన్సీ ఏరియా సర్వేలో వెలుగులోకి సంచలనాలు.. ఆశాలు, అంగన్వాడీల పాత్ర కీలకం!

IndiGo: ప్రయాణికులకు ఇండిగో భారీ ఊరట.. విమానాల అంతరాయాలతో తీవ్రంగా నష్టపోయిన వారికి రూ.500 కోట్లకు పైగా పరిహారం