Damodar Raja Narasimha: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేలసంగం లోని కాటన్ మిల్ లో (cotton) కార్పొరేషన్ అఫ్ ఇండియా (CCI) అద్వర్యం లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో కలసి ప్రారంభించారు .ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని (CCI) ఆధ్వర్యం లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు . రైతులకు కనీస మద్దతు ధర (MSP ) ను కల్పించాలని CCI అధికారులను మంత్రి కోరారు.
కపాస్ కిసాన్ ‘మొబైల్ యాప్ ను డౌన్ లోన్ చేసుకోవాలి
దళారులను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా సదాశివ పేట , రాయికోడ్ , నారాయణ ఖేడ్ , జోగిపేట , వాట్పల్లి మండలాల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పత్తి రైతులు కనీస మద్దతు ధర (MSP ) కోసం ‘కపాస్ కిసాన్ ‘మొబైల్ యాప్ ను డౌన్ లోన్ చేసుకోవాలని CCI అధికారులు కోరారు . గత వర్షాకాలం (2024-25) లో 3 లక్షల 80 వేల క్వి0టాల్ల పత్తిని కోనుగోలు చేసి రైతులకు 280 కోట్ల రూపాయలను చెల్లించామని CCI అధికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి వివరించారు . పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని మంత్రి అధికారులను ఆదేశించారు . ఈ సందర్బంగా రైతులకు జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణి చేశారు . ఈ కార్యక్రమం లో CCI సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ వరుణ్ , జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు .
Also Read: Damodar Raja Narasimha: హరే కృష్ణ సెంటర్ ఆధ్యాత్మిక ప్రారంభోత్సవంలో.. మంత్రి దామోదర్ రాజనర్సింహా

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				