Kaushik Reddy (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై రేగిన దుమారం.. పోలీసులకు ఫిర్యాదు

Kaushik Reddy: కాంట్రవర్స్ కేరాఫ్ గా నిలిచే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) ముఖ్యమంత్రి మంత్రులు, దళిత మంత్రులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్(Congress) శ్రేణులు హనుమకొండ(Hanumakonda), కరీంనగర్(Karimnagar) జిల్లాలోనీ పలు మండలాల్లో ఆందోళనలు చేపట్టారు. పాడి కౌశిక్ రెడ్డి పాడు మాటలు మాట్లాడడం మానుకోవాలని లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వని హెచ్చరిస్తూ తీవ్రంగా ఆందోళనలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revan Reddy), మంత్రులపై విచక్షణ రహితంగా మాట్లాడిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్(Congress) శ్రేణులు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రుల ఫోన్లు, సినీ తారల ఫోన్లను సీఎం ట్యాపింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనడం సరికాదని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్(Congress) శ్రేణులు కరీంనగర్ జిల్లా జమ్మకుంట, హుజురాబాద్, హనుమకొండ(Hanumakonda) జిల్లాలోని పలు మండలాల్లో ఆందోళనలు చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో పాడి కౌశిక్ రెడ్డి(Koushik Reddy) దిష్టిబొమ్మతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గాడిదపై కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మని కూర్చోబెట్టి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేశారు. గాడిదకు ఉన్న సిగ్గు కౌశిక్ రెడ్డికి లేదంటూ నినాదాలు చేశారు.

Also Read: Swachh Survekshan: బల్దియా లక్ష్యం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో టాప్ రావడమే!

బహిరంగ క్షమాపణలు చెప్పాలి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యలను కౌశిక్ రెడ్డి వెనక్కి తీసుకుని వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేసారు. కోవర్ట్ రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి తరిమి కొడితే బీఆర్ఎస్(BRS) పార్టీలో పడ్డావు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే రోడ్లపై ఉడికించి కొడతామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మౌనాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. కేటీఆర్(KTR) తో కలిసిన తర్వాత పిచ్చికుక్కలా మాట్లాడుతున్నావు. నోరు జాగ్రత్త పెట్టుకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు.

Also Read: Hyd Collector: యూపీ బాలుడి అభ్యర్థనకు కలెక్టర్ హరిచందన రెస్పాన్స్

 

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?