Janhvi Kapoor (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Janhvi Kapoor: ఛీ ఛీ వాడు మనిషేనా.. చాలా సిగ్గుచేటు.. జాన్వీ తీవ్ర ఆగ్రహం!

Janhvi Kapoor: మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే మహిళా రిసెప్షనిస్ట్ పై ఓ వ్యక్తి అతి దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ అపాయింట్ మెంట్ లేకపోవడంతో సదరు వ్యక్తిని రిసెప్షనిస్ట్ లోపలికి అనుమతించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు మహిళ అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాగి ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. ఈ ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జాన్వీ ఏమన్నారంటే?
మహిళా రిసెప్షనిస్ట్ పై దాడి ఘటనను ఇన్ స్టాగ్రామ్ వేదికగా జాన్వీ కపూర్ ఖండించారు. ‘దాడి చేసిన వ్యక్తి జైలులో ఉండాలి. ఇలాంటి ప్రవర్తన సరైనదని ఎవరు భావిస్తారు? ఇలా చేయడానికి అతనికి ధైర్యం ఎలా వచ్చింది? ఎలాంటి పెంపకం వల్ల ఒక వ్యక్తి ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడు?. పశ్చాత్తాపం, అపరాధ భావన లేకుండా ఉంటాడు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఇది సిగ్గుచేటు’
మనం ఉంటున్న సమాజంలో ఈ తరహా ఘటనలు జరగడం సిగ్గుచేటని జాన్వీ కపూర్ అన్నారు. అలాంటి వ్యక్తి ఉన్న సమాజంలో ఎలా జీవించగలమని ప్రశ్నించారు. ఇది ఎంత అవమానకరమంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మహిళ పట్ల అంత క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తిని త్వరితగతిన శిక్షించకపోతే అది క్షమించరాని తప్పే అవుతుందని నటి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాన్వీ చేసిన వ్యాఖ్యలు.. అటు బాలీవుడ్ (Bollywood)తో పాటు సోషల్ మీడియా (Social Media)లో చర్చనీయాంశంగా మారాయి. జాన్వీ మాటలకు మద్దతు ఇస్తూ.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Fat Loss Tips: ఒంట్లో కొవ్వు పెరిగిపోతోందా? ఈ 7 చిట్కాలతో చెక్ పెట్టండి!

దాడి వివరాలు ఇవే
మహారాష్ట్ర థానేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ దాడి ఘటన జరిగింది. గోకుల్ ఝూ అనే వ్యక్తి.. 25 ఏళ్ల మహిళా రిసెప్షనిస్ట్ వద్దకు పరిగెత్తికెళ్లి ఆమెను కాలితో బలంగా తన్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. అతడ్ని నిలువరించే ప్రయత్నం చేసినా అతడు వెనక్కి తగ్గలేదు. మహిళ జుట్టు పట్టుకొని లాగి నేలపైన పడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా అవి కాస్త వైరల్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి, అసభ్యకర పదజాలం, అవమానించడం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతడికి సెషన్స్ కోర్ట్ రెండు రోజుల పోలీసు కస్టడీ సైతం విధించింది.

Also Read This: Shubham Gill: గిల్ పక్కదారి పట్టాడు.. అతడో విలన్.. మాజీలు ఫైర్!

Also Read This: Rajeev Kanakala: చిక్కుల్లో నటుడు రాజీవ్ కనకాల.. పోలీసుల నోటీసులు.. మ్యాటర్ ఏంటంటే?

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?