Medak District: మెదక్ ఎమ్మల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకలు శనివారం మెదక్ నియోజక వర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. మెదక్(Medak), రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, హవేలీ ఘన్పూర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ(Congress) ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మెదక్ చర్చి ,వెంకటేశ్వర ఆలయం, దర్గాలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. రామాయంపేట మండలం అక్కన్నపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో మైనంపల్లి రోహిత్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో..
మహేందర్ రెడ్డి(Mahender Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumantha Rao) పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ జడ్పిటిసి సరాప్ యాదగిరి సుప్రభాత రావు, మైపాల్ రెడ్డి, అరుణార్తి వెంకట రమణ, రమేష్ రెడ్డి దేమేయాదగిరి,అశోక్, రాజుగుప్త, పాపన్నపేట మండల కేంద్రం లో జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఏడుపాయల దుర్గామాత ఆలయ సన్నిధిలో అయ్యప్ప భక్తులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.బైక్ ర్యాలీ నిర్వహించారు. నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Temple Tragedy: ఏపీలో ఘోర విషాదం.. ఆలయంలో తీవ్ర తొక్కిసలాట.. పలువురు భక్తులు మృతి
