Jogulamba Gadwal: విద్యార్థులకు నాణ్యమైన బోధన చేసేందుకు ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించింది. కానీ కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సంగతి మాకేం మా వ్యక్తిగత పనులు ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు.జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సుంకులమ్మ మెట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు, మహబూబ్ నగర్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన మరొక ఉపాధ్యాయురాలు ఉండగా ఇద్దరూ పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు అన్నీ తామై ముందుకు నడిపించారు. అందుకు ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే ఆయానే విద్యార్థులకు బాసటగా నిలిచింది.
Also Read:KCR Meetings: భవిష్యత్తు కనపడుతోందా.. బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్
హెడ్ మాస్టర్ సెలవు
విద్యార్థులను క్రమ సంఖ్యలో ఉంచి ప్రేయర్ చేయించారు.అనంతరం తరగతి గదిలో విద్యార్థులు కూర్చోగా పాఠ్యాంశాలను బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో బోర్డును చూస్తూ గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయురాలు ఉండగా ఆరోగ్య కారణాలతో హెడ్ మాస్టర్ సెలవు పెట్టగా, మరొక ఉపాధ్యాయురాలు రాలేదని విద్యార్థులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలలోనే ఉపాధ్యాయుల తీరు ఈ విధంగా ఉంటే మారుమూర ప్రాంతాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది.
విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పుతూ నాణ్యమైన విద్య అందించడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించి పోటీ ప్రపంచంలో భవిష్యత్తును సిద్ధం చేయాల్సిన బాధ్యత కలిగిన ఉపాధ్యాయు(రా)లు ఈ విధంగా బాధ్యతారాహితంగా వ్యవహరించడం శోచనీయమని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ బడులను నమ్ముకుంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదివించేందుకు ఆర్థిక భారం అవుతున్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. పలు గ్రామాలలో బోధించే ఉపాధ్యాయులు సైతం ఆలస్యంగా పాఠశాలకు చేరుకుంటున్నారని దీంతో విద్యార్థులు చదువుపై ఇష్టతను కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు బడులను బలోపేతం చేసి అంకిత భావంతో విద్యా బోధన చేసేలా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎంఈఓ వివరణ
పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు సెలవులో ఉండగా మరొకరు సకాలంలో పాఠశాలకు చేరుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.అందుకు సంబంధిత డిప్యూటేషన్ పై వచ్చిన ఉపాధ్యాయురాలి వివరణ కోరాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.
Also Read: Kingdom First Day Collection: ‘కింగ్డమ్’ మొదటి రోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరీర్లోనే రికార్డ్