Kingdom First Day Collection: . విజయ్ దేవరకొండ కెరీర్లోనే రికార్డ్
Kingdom First Day Collection ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Kingdom First Day Collection: ‘కింగ్డమ్’ మొదటి రోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరీర్లోనే రికార్డ్

Kingdom First Day Collection: విజయ్ దేవరకొండ కింగ్డమ్ (2025) సినిమా జూలై 31 న థియేటర్లలో రిలీజ్ అయింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్. ఒక్క హిట్ కొట్టడానికి విజయ్ దేవర కొండకి ఆరేళ్ళు పట్టింది. లైగర్ దెబ్బ నుంచి లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ వరకు ఫ్లాప్ గా నిలిచాయి. ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్స్ పడుతున్నా కూడా ఎక్కడా తగ్గకుండా, తన ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కొండన్న ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలని ఎంతో మంది కోరుకున్నారు. వారి కోరిక నెరవేరినట్లు ఉంది. పైగా తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామి దయ ఉంటే ఈ సారి పోయి టాప్ లో కూర్చొంటా .. అని చెప్పడంతో ఫ్యాన్స్ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. మనం హిట్ కొట్టేసాం అంటూ ట్విట్టర్లో పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read: Meenakshi Natrajan: ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. రంగాపూర్ నుంచి పాదయాత్ర షురూ!

ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించగా, అనిరుధ్ రవిచంద్ర సంగీతాన్ని అందించారు. మరి, అంత హైప్ ఇచ్చినప్పుడు హిట్ పడుతుందిగా.. మొత్తానికి కొండన్న హిట్ కొట్టేసాడు.

Also Read: Mobiles Under Rs 10000: రూ.10వేల బడ్జెట్‌లో తోపు స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

రిలీజ్ రోజు సాయంత్రం నిర్మాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని చోట్లా 50 శాతం ఓపెనింగ్స్ వచ్చాయని తెలిపారు. వరల్డ్ వైడ్ గా కింగ్డమ్ సినిమా మొదటి రోజు రూ.39 కోట్లను కలెక్ట్ చేసిందని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే మొత్తం రూ. 25 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఏపీ, తెలంగాణలో మొదటి రోజు ఆల్మోస్ట్ 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. అమెరికాలో 1.1 మిలియన్ డాలర్స్ గ్రాస్ వచ్చేసినట్టు చిత్ర బృందం అధికారికంగానే ప్రకటించారు. అంటే, ఆల్మోస్ట్ 8 కోట్ల రూపాయలకు పైగా యూఎస్ నుంచి కలెక్షన్స్ మొదటి రోజే వచ్చేసాయి.

Also Read: Meenakshi Seshadri: స్లీవ్‌లెస్ గౌనులో.. ‘ఆపద్భాంధవుడు’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో చూశారా?

Just In

01

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం

Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్