Minister Sridhar Babu: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) యూఏఈ పారిశ్రామికవేత్తలను కోరారు. (HICC) హెచ్ఐసీసీలో యూఏఈ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇన్వెస్టోపియా గ్లోబల్ పేరిట నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘భౌగోళికంగా చిన్నదైనా, ఆశయాలు, ఆచరణలో మాత్రం తెలంగాణ చాలా పెద్దదన్నారు. స్వల్ప కాలంలోనే ఫీనిక్స్ పక్షిలా ఎదిగి ఇతర రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిచిందన్నరు. 2024–25లో జీఎస్‌డీపీలో 8.2 శాతం వృద్ధి నమోదైందని, ఇది జాతీయ సగటు(7.6%) కంటే ఎక్కువ అన్నారు.
Also Read: PM Modi Record: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్ బద్దలు!
మెట్రో ఫేజ్ – 2
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతానికి పైగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్‌లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక కారిడార్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నెట్-జీరో పారిశ్రామిక పార్కులు, ఈవీ జోన్లు, గ్రీన్ లాజిస్టిక్స్ హబ్‌లు, రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్), మెట్రో ఫేజ్ – 2 తదితరాలు పారిశ్రామికాభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నాయని, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్న ఫ్యూచర్ సిటీ ఫిన్‌టెక్, క్లైమేట్-టెక్, స్మార్ట్ మొబిలిటీ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మారబోతోందన్నారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఎగుమతులు, ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ మొబిలిటీ, పర్యాటకం, వెల్‌నెస్, మెడికల్ తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. కార్యక్రమంలో యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ, టూరిజం అబ్దుల్లా బిన్ తాక్ అల్ మర్రి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, అండర్ సెక్రటరీ ఆఫ్ ది యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ మహ్మద్ అల్వాహీ, యూఏఐ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ వాలిద్ హరేబ్ అల్ ఫలాహి, ఇన్వెస్టోపియా సీఈవో డా.జీన్ ఫారెస్ పాల్గొన్నారు.
Also Read: BC Reservation Bill: రాజ్ భవన్ వైపు సర్కార్ చూపు.. నెక్స్ట్ ఏంటి?