BC Reservation Bill (Image CREDIT: TWITTER)
తెలంగాణ

BC Reservation Bill: రాజ్ భవన్ వైపు సర్కార్ చూపు.. నెక్స్ట్ ఏంటి?

BC Reservation Bill: బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నా, ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం కోసం వేచి చూస్తోంది. బీసీ రిజర్వేషన్‌ 42 శాతం అమలు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లుగా స్పష్టమవుతున్నది. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్‌కు పంపించిన ఆర్డినెన్స్ ఇప్పటికీ క్లియర్ కాలేదు. ఆర్డినెన్స్ పంపించి దాదాపు రెండు వారాలు కావొస్తున్నా, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో రిజర్వేషన్లు ప్రాసెస్ నిర్వహించే ఛాన్స్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. సీఎం, సీఎస్, ఉన్నతాధికారులు కూడా ఈ ఆర్డినెన్స్‌ను వేగంగా పూర్తి చేయాలని గవర్నర్‌ను ప్రత్యేకంగా కోరారు. కానీ, ప్రభుత్వానికి ఇప్పటి వరకు పాజిటివ్ సంకేతాలు రాలేదు.

మరోవైపు 30 రోజుల్లో రిజర్వేషన్లను పూర్తి చేయాలని గతంలో హైకోర్టు సూచించింది. ఈ గడువు జూలై 24 తోనే పూర్తయ్యింది. దీంతో సర్కార్ డైలమాలో పడింది. బీసీ రిజర్వేషన్లను ఏం చేస్తే అమలు చేయవచ్చు? ప్రభుత్వానికి ఉన్న తదుపరి ఆప్షన్స్ ఏమిటీ? గవర్నర్ ఆర్డినెన్స్ క్లియర్ చేయకపోతే ఎలా? ఒకవేళ చేస్తే ఆ తర్వాత ప్రాసెస్ ఎలా స్పీడ్‌గా తీసుకువెళ్లాలి? అనే అంశాలపై శుక్రవారం కేబినెట్‌లో భేటీలో చర్చ జరగనుంది. ఇదే ప్రధాన అజెండాగా కేబినెట్ మీటింగ్ జరుగుతుందని ఓ మంత్రి తెలిపారు. ప్రభుత్వం తప్పనిసరిగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పక్కాగా అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Rahul Gandhi: తెలంగాణ దేశానికే మైలు రాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలు

బీఆర్ఎస్ తెచ్చిన చిక్కులు!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదని సీలింగ్ విధిస్తూ పంచాయతీ రాజ్ చట్టం 2018–19లో పొందుపరిచింది. ఈ క్లాజ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద సమస్యగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం సీరియస్‌గా ముందుకెళ్తున్నా, గతంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ క్యాప్ అడ్డుకుంటున్నది. ఈ క్యాప్ తొలగించకపోతే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంపు సాధ్యపడదు. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం సవరణకు ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్‌కు పంపించింది. కానీ, ఆయన ఇప్పటి వరకూ ఆ ఆర్డినెన్స్‌కు అనుమతులివ్వలేదు.

రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ఆర్డినెన్స్‌కు బ్రేక్‌లు వేస్తారని తాము కూడా ఊహించలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మూడ్రోజుల క్రితమే లీగల్ ఓపీనియన్ తీసుకున్న గవర్నర్ ఆ ఆర్డినెన్స్‌కు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు? అని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినెన్స్‌కు అనుమతి రాకుంటే స్థానిక సంస్థల్లో గతంలో ఉన్నట్లే 22 శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. పైగా ఎన్నికల నిర్వహణ కోసం హైకోర్టు ఇచ్చిన గడువు కూడా సమీపిస్తున్నది.

ఆ తర్వాతే యాక్షన్ ప్లాన్
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు పంచాయతీ రాజ్ చట్టం సవరించాలంటే గవర్నర్ సంతకం తప్పనిసరి. గవర్నర్ సంతకం పూర్తయితే ప్రభుత్వం వెంటనే జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నది. రిజర్వేషన్ ప్రకారం పార్టీలో 42 శాతం సీట్లను బీసీలకు ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన గడువు లోపే స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సాధ్యపడుతున్నది. లేకుంటే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఇక దీంతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వర్తించాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అసెంబ్లీ తీర్మానం తర్వాత రాష్ట్రపతికి వెళ్లిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు కూడా ఢిల్లీలోనే పెండింగ్ ఉన్నది. ఆ బిల్లును కూడా క్లియర్ చేసేందుకు సీఎంతో సహ ప్రభుత్వ యంత్రాంగం అంతా శ్రమిస్తున్నది. గవర్నర్ తీసుకునే తుది నిర్ణయంపై ప్రభుత్వం తదుపరి యాక్షన్ ప్లాన్ ఆధారపడి ఉన్నది.

 Also Read: Sapta Sindhu 2025: ఆలయ నమూనాల పోటీల్లో ఆర్కిటెక్చర్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్