Man Suicide Attempt (imagcredit:swetcha)
నార్త్ తెలంగాణ

Man Suicide Attempt: డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని వ్యక్తి హల్చల్

Man Suicide Attempt: ప్రభుత్వం తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు(Dabul Bed Room Home) మంజూరు చేయలేదని ఒ వ్యక్తి పెట్రోల్(Petrol) బాటిల్ తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇల్లు మంజూరు చేయకుంటే పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకొని ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. గజ్వేల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన స్వామి(Swamy) తనకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయ నాయకులు హామీ

గతంలో రోడ్డు(Road) విస్తరణ పనుల్లో భాగంగా క్యాసారం గ్రామంలో కొంతమంది ఇల్లు తొలగించడం జరిగింది. అప్పట్లో సదర్ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని అధికారులు అప్పటి రాజకీయ నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ మారడంతో ఇల్ల మంజూరు ఇటీవల జరగగా పలువురు బాధితులకు ఇల్లు మంజూరు కాలేదని ఆందోళన వ్యక్తం అవుతుంది.

Also Read: Dokka Seethamma: ‘డొక్కా సీతమ్మ’ గురించి ఈ విషయం తెలుసా?

ఇల్లు మంజూరు చేయలేదని ఆందోళన

గ్రామంలోని స్వామి తన ఇల్లు కోల్పోయినప్పటికీ తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని ఆందోళన చేస్తూ పెట్రోల్ బాటిల్(Petrole Botile) తో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద హల్చల్ చేశారు. వెంటనే అధికారులు కల్పించుకొని తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరాడు. స్థానిక పోలీసులు కల్పించుకొని సదర వ్యక్తిని సముదాయించి పోలీస్ స్టేషన్(Police Station) కు తరలించారు. కాగా ఇటీవల గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరి పత్రాలు అందజేయడంతో ఇండ్లు మంజూరు కాని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Bonalu Festival 2025: నేటి నుంచి బోనాలు ప్రారంభం.. పకడ్బందీగా నిధుల కేటాయింపు!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు