Gadwal District: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు వివిధ రకాల వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ పాఠశాలల(Private schools) యాజమాన్యాలు మాత్రం తమ సొంత బస్సుల్లోనే విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తుంటాయి. అయితే ఈ బస్సులను ఫిట్‌గా ఉంచడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు చోటుచేసుకొని విద్యార్థులు గాయాలబారిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల ఫిట్‌నెస్‌పై పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లకు ఆర్టీవో అధికారులు అవగాహన కల్పించారు. బస్సులను తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నా కొందరు పట్టించుకోవడంలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నారు.
Also Read: Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు హాజరైన విజయ్ దేవరకొండ
రవాణ చార్జీల పేరిట దోపిడి
ప్రైవేటు పాఠశాలల(Private schools) యాజమాన్యాలు రవాణా చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నా.. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో ఉన్న పలు ప్రైవేటు(Private schools) విద్యాసంస్థలకు ఎక్కువగా వచ్చేది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే. తల్లి దండ్రులు పిల్లలను స్కూల్‌కు పంపి వారి పని మీద వారు వెళ్తే బస్సులో స్థాయికి మించి ఎక్కువ విద్యార్థులను తరలించి గమ్య స్థానాలకు చేరుకుంటారో తెలియని పరిస్థితి. ఒక్కో విద్యార్థి నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు నెలకు రూ.1000 నుంచి రూ.6000 వరకు దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలు భద్రంగా ప్రయాణం చేస్తారనే నమ్మకంతో తల్లిదండ్రులు ఉంటారు.
గద్వాల పట్టణం, ధరూర్ మండలంలోనే పలు ప్రైవేట్ స్కూల్(Private schools Bus) బస్సులో పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించి కూర్చోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. బస్సులో డెబ్బై మందికి పైగా ప్రయాణాలు చేస్తున్నారు. ఇద్దరు కూర్చొని ప్రయాణించాల్సిన సీట్లలో నలుగురు కూర్చోని ప్రయాణిస్తున్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ లు వాహనాలను అతివేగంగా నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గద్వాలలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు(Private schools) డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో గోనుపాడు గ్రామస్తులు అడ్డుకుని స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా బల్గెరలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇలా తరుచు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు స్కూల్ బస్సుల ప్రమాదాలు జరగకుండా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
యాజమాన్యాలదే బాధ్యత: టి.వెంకటేశ్వర రావు, డీటిఓ
విద్యాసంస్థల బస్సులను నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. నింబంధనలు అతిక్రమించిన బస్సులను సీజ్ చేస్తున్నాం. స్కూల్ బస్సుల విషయంలో యాజమాన్యాలే పూర్తి బాధ్యత తీసుకోవాలి. కండీషన్‌లో ఉన్న బస్సులను ఏర్పాటు చేసుకోవాలి. నిష్ణాతులైన డ్రైవర్లనే ఎంపిక చేయాలి. ఫిట్‌నెస్ పత్రాలు పొంది ఉండాలి. లేదంటే చర్యలు తప్పవు.
Also Read: Rahul Gandhi on Modi: ట్రంప్ విమర్శలపై ప్రధాని సైలెంట్.. కారణమేంటో చెప్పిన రాహుల్!