Gadwal District: జిల్లాలో తరచుగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి ఇలాంటి తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడే తరుణంలో ప్రైవేట్లో స్కానింగ్ సెంటర్లు అధికంగా వసూలు చేయడంతో పేదల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ను గత రెండు నెలల క్రితం జిల్లా కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి నేటికి సిటీస్కాన్ స్పెషలిస్టులను నియమించడంలో అలసత్వం కారణంగా యంత్రం ఖాళీగా దర్శనమిస్తుంది. జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల రోడ్లపై అధికమైన వాహనాల విని యోగంతో పాటు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసు కుంటున్నాయి. గాయపడిన వారిని సమీపంలో ఉండే జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. వారిలో తలకు గాయాలైన వారు ఎక్కువగా ఉంటున్నారు. వీరికి అత్యవసరంగా సీటీ స్కాన్ చేయాల్సి ఉండగా యంత్రం వినియోగంలో లేకపోవడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
యంత్రం వచ్చి 2 నెలలు కావస్తున్నా
డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ విభాగాల్లో వాటి సేవలు అవసరమైన రోగులకు సేవలందుతున్నాయి. అయితే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో తలకు బలమైన గాయాలైన వారికి సీటీ స్కాన్ చేసే అవకాశం లేకపోవడంతో రోగులు స్థానికంగా ఉన్న ప్రైవేటు కేంద్రాలకు వెళుతున్నారు. ఆసుపత్రిలోనే సీటీ స్కాన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల మెడికల్ కాలేజీ నిర్వహణ మొదలైన నేపథ్యంలో తెలంగాణ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఐడీసీ) ఆధ్వర్యంలో ఈ యంత్రం వచ్చి నెలలు గడుస్తోంది.
Also Read: Etala Rajender: హరీష్ రావును నేనెందుకు కలుస్తా.. ఈటల సంచలన కామెంట్స్!
వెంటనే ప్రారంభిస్తే మేలు
జిల్లాలోని గద్వాల, ధరూర్, కేటీ దొడ్డి, గట్టు, మల్దకల్, ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, రాజోలి, వడ్డేపల్లి, ఉండవల్లి, ఐజ మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని 108 అంబులెన్సులు, ఇతర వాహనాల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదాల్లో తలకు గాయ మైన వారికి సీటీ స్కాన్ చేసేందుకు ప్రైవేట్ లో రూ.2,500 నుంచి రూ. 6 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఆసుపత్రిలో సేవలు ప్రారంభిస్తే పేద రోగులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు దృష్టి సారంచాలని కోరుతున్నారు.
త్వరలో అందుబాటలోకి ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు.
రేడియాలజిస్టులను నియమించేందుకు ఇప్పటికే అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. నిపుణులను నియమించేందుకు కసరత్తు జరుగుతుంది. పోస్టులు భర్తీ అయిన వెంటనే సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తెస్తాంమని అన్నారు.
Also Read: Karnataka HC – Kamal Haasan: కమల్ దూకుడుకు బ్రేక్.. హైకోర్ట్ సైతం చివాట్లు.. ఇక తగ్గాల్సిందే!