మహబూబాబాద్ స్వేచ్ఛ: Ramulu Naik on KCR: కేసీఆర్…! మీ ఎమ్మెల్సీ పదవి.. వెంట్రుకతో సమానం.. ఎవరినీ మేం బిచ్చం అడగమని స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి నిన్ను గద్దె దించి, నీకు నీ కుటుంబానికి రాజకీయ మనుగడ లేకుండా చేశామని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సభలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడారు.
Also Read: Hyderabad Police: మద్యం త్రాగి, బండి నడిపి.. ఇంత మంది పట్టుబడ్డారేంటి?
రాములు నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ రాచరికపు పాలన తమకు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని హితవు పలికారు. తెలంగాణను తెచ్చి నువ్వు, నీ కొడుకు, బిడ్డ, అల్లుడు తప్ప ఎవ్వరూ బాగుపడలేదని మండిపడ్డారు. నిన్ను భరించలేమని కేసీఆర్ కు చెప్పి మరీ గద్దె దించినామని గుర్తు చేశారు.
గిరిజనుల శక్తిని తక్కువగా అంచనా వేయకుండా, మిమ్మల్ని మంచిగా చూసుకొమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రాందాస్ నాయక్, రాజునాయక్, కిషన్ సింగ్, శ్రీను నాయక్, బొడ్రాయి తండా గ్రామపంచాయతీ అధ్యక్షుడు, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తేజావత్ వెంకన్న నాయక్ పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు