Khammam District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Khammam District: భారీ వర్షాలకు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి.. ఎక్కడంటే..?

Khammam District: చింతకాని మండలం రామకృష్ణాపురం వద్ద వాగు పై వరద ఉధృతి ప్రవహిస్తోంది. ఖమ్మం(Khammam), బోనకల్ రహదారి పై రాకపోకలుని నిలిపివేసిన పోలీస్ సిబ్బంది. నిత్యం రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి దారి మళ్లిస్తున్నారు.

విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో నేడు (గురువారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నేడు (గురువారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

అత్యవసరమైతేనే బయటికి రావాలి

బుధవారం నుండి నాల్గు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ(Weather Department) తెలిపిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ప్రజలు వారి గ్రామంలో వర్షాల కారణంగా ఎవరు బయటకు వెళ్లొద్దని తహసీల్దార్ కె.నాగరాజు తెలిపారు. వ్యవసాయ పనులకు, చేపలు పట్టుటకు, పశువులను తీసుకొని గాని ఎవరూ వెళ్లరాదని, పాత ఇండ్లలో, కూలిపోయే ఇండ్లలో వారిని ఖాళి చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, గ్రామ ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని తహసిల్దార్ ప్రజలకు సూచించారు.

Also Read; Viral Video: 25 ఏళ్ల యువతిని వేధించిన ఏడేళ్ల బాలుడు.. విలపిస్తూ వీడియో పెట్టిన బాధితురాలు!

రాకపోకలు నిలిపివేత

ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పసర నుంచి తాడ్వాయి మధ్యలో మండల తోగు వద్ద జలగలంచ వాగు ఉదృతంగా రోడ్డు మీద నుండి ప్రవహిస్తుంది. ములుగు జిల్లా ఎస్పి శబరీష్(SP Shebarish) వాగును సందర్శించి ఇరువైపులా వరద ఉధృతి తగ్గే వరకు వాహనాల రాకపోకలను నిషేధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల(ఓవర్ బర్డెన్) మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. గనిలో చేరిన సుమారు ఆరు వందల లక్షల గ్యాలన్ల వరద నీటిని 6 భారీ మోటార్ల సహాయంతో సిబ్బంది బయటకి తోసేస్తున్నారు.

Also Read: Govt On Parents: తల్లిదండ్రులను విస్మరిస్తే కటకటాలే.. రోడ్డుపై వదిలేసినా క్రిమినల్ కేసులు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?