Jurala Project: కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతున్నది. దీంతో కర్ణాటక జలాశయాల నుంచి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉదయం కర్ణాటక జలాశయాల నుంచి జూరాలకు 2,36,066 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా జూరాల 40 గేట్ల తెరచి దిగువకు 2,26,118 క్యూసెక్కులు వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో విషాదం.. అక్క కోసం వెళ్లి బాలుడి మృతి
విద్యుత్ ఉత్పత్తికి 20,218 క్యూసెక్కులు
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.508 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి 20,218 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. కాగా మరో వారం రోజుల పాటు వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు జూరాల అధికారులు తెలిపారు.
Also Read: Gadwal district Rains: గద్వాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల ఆవస్థలు