Suicide Attempt: జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి(Beechupally) కృష్ణానది(Krishna River) బ్రిడ్జిపై నుంచి నదిలోకి ఓ యువతి దూకింది. కొండపేట(Kondapeta)కు చెందిన మత్స్యకారులు గమనించి కాపాడిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర చోటుచేసుకుంది.
కర్నూలుకు టికెట్..
వివరాల్లోకెళ్తే హైదరాబాద్(Hyderabad) లోని జీడిమెట్ల సూరారంకు చెందిన జయ శ్రీ(jaya Sri) కుటుంబ కలహాల నేపథ్యంతో హైదరాబాద్(Hyderabad) ఎంజీబీఎస్(MGBS) బస్టాండ్ నుంచి రాత్రి 9 :19 నిమిషాలకు కర్నూలుకు టికెట్ తీసుకుని బీచుపల్లి దగ్గర దిగి నడుచుకుంటూ బ్రిడ్జి దాకా వెళ్లడం స్థానికులు గమనించారు. తీవ్ర మాస్తాపంతో ఆ యువతి కృష్ణానది బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకింది. కృష్ణా నది దగ్గర ఉన్న మత్స్యకారులు పరుశరామ్, లక్ష్మణ్, మద్దిలేటి, పెద్ద మద్దిలేటి గమనించి పుట్టి సహాయంతో నదిలోకి వెళ్లి యువతని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఇటిక్యాల ఎస్ఐ రవి(SI Ravi), యువతి భర్త పనిధర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తన భార్య కనపడకుండా పోయిందని సూరారం పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చామని తెలిపినట్లు ఎస్సై పేర్కొన్నారు. యువతికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: Ananya Nagalla: ప్రేమలో అనన్య నాగళ్ల.. ఏకంగా లాంగ్‌టెర్మ్ రిలేషన్‌షిప్ అంట, ఎవరితోనంటే?
కాపాడిన మత్స్యకారులు
ఘాట్ దగ్గర మత్స్యకారులు ఉండగా ఆ యువతి అనుమానస్పద కదలికలను గమనిస్తున్నారు. ఇదే క్రమంలో అకస్మాత్తుగా యువతి బ్రిడ్జిపై నుంచి దూకడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే పుట్టిలో వెళ్లి మత్స్యకారులు ఆ యువతిని కాపాడారు. దీంతో యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. మత్స్యకారుల మానవీయత పట్ల పలువురు అభినందించారు.
Also Read: Huzurabad: హుజూరాబాద్‌లో వైద్య అధికారి నిర్లక్ష్యం.. విధులకు డుమ్మా!
