Telangana Tourism ( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ, హైదరాబాద్

Telangana Tourism: అడ్వెంచర్ హబ్‌గా హైదరాబాద్.. పర్యాటక శాఖ వినూత్న ప్లాన్!

Telangana Tourism: తెలంగాణలోని అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ (Tourism Department) వినూత్న ప్రణాళికతో ముందుకు వస్తోంది. చారిత్రక కట్టడాలు, ఆలయాలు, కోటలు, ప్రకృతి అందాలైన అడవులు, జలపాతాలు పుష్కలంగా ఉన్న ఈ రాష్ట్రంలో తక్కువ బడ్జెట్‌లో విదేశీ పర్యటనలకు దీటుగా పర్యాటక అనుభూతిని అందించేందుకు కృషి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగం బలోపేతంపై దృష్టి సారించి, పక్కా ప్రణాళికలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది.

Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై నేటికి వాయిదా పడ్డ విచారణ.. లైన్ క్లియర్ అయినట్టేనా?

50 ప్రదేశాల గుర్తింపు

పర్యాటకులను ఆకర్షించడంతో పాటు శాఖకు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో త్వరలోనే కస్టమైజ్డ్ టూరిజంను అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ను చారిత్రక, సాంస్కృతిక కేంద్రంగా, అడ్వెంచర్ హబ్‌గా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న 50 పర్యాటక ప్రదేశాలను గుర్తించారు. యువత, కుటుంబాలు, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చరిత్ర, సాహస క్రీడలను ముడిపెట్టి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాత్రివేళ టూర్స్‌లో..

కస్టమైజ్డ్ టూరిజం ప్యాకేజీలో గోల్కొండ, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం వంటి ప్రముఖ చారిత్రక స్థలాలతో పాటు బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, వండర్ లా, లాడ్ బజార్ షాపింగ్ వంటి ప్రదేశాలను కవర్ చేయనున్నారు. అంతేకాకుండా, పర్యాటకులను ఆకర్షించేందుకు రాత్రివేళ టూర్స్‌లో గోల్కొండ లైట్ అండ్ సౌండ్ షో, చారిత్రక ప్రదేశాలతోపాటు రాక్ క్లైమ్బింగ్, పారాగ్లైడింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీలను కూడా ఈ టూర్లలో చేర్చనున్నారు.

ఇంటి వద్దకే వాహనం

పర్యాటకుల సౌలభ్యం కోసం కస్టమైజ్డ్ టూరిజంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది టూర్ బుక్ చేసుకుంటే, వారి ఇంటి వద్దకే వాహనాలను పంపించే వినూత్న వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంటే వెంటనే అధికారులు స్పందించి వాహనాన్ని పంపిస్తారు.

ప్యాకేజీని బట్టి..

టూరిజం ఎండీ క్రాంతి మాట్లాడుతూ, తొలుత ఈ సదుపాయాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో అమలు చేస్తామని, ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ‘శాఖకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. ప్యాకేజీని బట్టి ధరలను టూరిజం పోర్టల్‌లో పొందుపరుస్తాం. పదిమంది టూర్‌కు ప్లాన్ చేసుకుంటే, ఆ వివరాలను పోర్టల్‌లో బుక్ చేసుకుంటే వారి ఇంటి వద్దకు వాహనం పంపిస్తాం. ప్రజలకు మరింత అందుబాటులోకి టూరిజంను తీసుకుపోతాం’ అని క్రాంతి వివరించారు. ఈ కొత్త విధానం ద్వారా పర్యాటకులు, కుటుంబాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

Also Read: Huzurabad: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు.. పెండింగ్ బిల్లులతో తల్లిదండ్రుల ఆందోళన

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?