నర్సంపేట, స్వేచ్ఛ: Diagnostics Centre Narsampet: తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ పేరుకే పెద్దగా ఉంది. ఇందులో 140 పరీక్షలు రోగులకు అందుబాటులో ఉంటాయని ఊదరగొట్టారు. కానీ డయాగ్నస్టిక్ లో ఆశించిన పరీక్షలు కూడా అందుబాటులో లేవు. రోగులను పరీక్షల కోసం వరంగల్ కు పంపించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. రోగులు పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్ కు వెళితే నిరాశ ఎదురవు తున్నది.
రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుగా పరీక్షలు చేయించాల్సిన దుస్థితి ఉంది. రోగ నిర్ధారణ కేంద్రంలో సరిగా పరికరాలే పనిచేయని పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వం నర్సంపేటలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ రూ. 2.20 కోట్లతో ఏర్పాటు చేసింది. జిల్లాకో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లో భాగంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన డయాగ్నస్టిక్ సెంటర్ ను నర్సంపేటకు కేటాయించారు. దీనిని అప్పటి ప్రభుత్వంలోనే ప్రారంభించారు.
ఎంజీఎంలో చేసే పరీక్షలు ఇక్కడే
వరంగల్ ఎంజీఎంలో చేసే పరీక్షలు అన్నీ తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లోని చేస్తారు. వరంగల్ జిల్లాలో ఉన్న మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని రక్త నమూనాలను కూడా ప్రతిరోజు నర్సంపేటలో ఉన్న డయాగ్నస్టిక్ హబ్ కు ప్రతిరోజు పంపించాల్సి ఉంది. వర్ధన్నపేట సిహెచ్సిలో తీసే రక్త నమూనాలను కూడా కూడా ఇందులోనే పరీక్షిస్తారు. నర్సంపేట లోని కొత్తగా ఏర్పాటైన జిల్లా స్థాయి ఆసుపత్రికి వచ్చే రోగుల పరీక్షలను కూడా తెలంగాణ హబ్ లోనే పరీక్షలు చేయాల్సి ఉంది.
Also read: Yadadri-Bhuvanagiri incident: ప్రమాదానికి కారణమయ్యాడు..జైలుకెళ్ళాడు
ప్రతిరోజు ప్రత్యేక వాహనాల ద్వారా రక్త నమూనాలను నర్సంపేట లోని డయాగ్నస్టిక్ సెంటర్ కు తరలించేందుకు ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన పరీక్షలు అన్నీ చేసి ఆన్‌లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ పరీక్షల కాఫీ ఆన్‌లైన్లో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిహెచ్సికి జిల్లా స్థాయి ఆసుపత్రికి వైద్యులు సిబ్బంది చూసుకునేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోగులకు సమాచారం కూడా ఫోన్లో పరీక్షల ఫలితాలను పంపిస్తున్నారు. కానీ ఆచరణలో ఇది సాధ్యం కావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లో అన్ని రకాల ల్యాబులను ఏర్పాటు చేశారు. ఇందులో 140 రకాల పరీక్షలు భూములకు అందుబాటులో ఉన్నాయి.
సమస్యలే ఇక్కడ కొలువు…
తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లో సమస్యలే కొలువుదీరి ఉన్నాయి. జిల్లా స్థాయి ఆసుపత్రి తో పాటు, నర్సంపేట లో ఉన్న పాత సిహెచ్సి, వర్ధన్నపేట సిహెచ్సి, మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కొందరు రోగులు వైద్యులు రాసిన చిట్టిలతో పరీక్షల కోసం రావడంతో ఆ పరీక్షలు ఇక్కడ అందుబాటులో లేవని తిప్పి పంపుతున్నారు. రక్తహీనత తో బాధపడుతున్న ఒక మహిళ నర్సంపేట లోని జిల్లా ఆస్పత్రిలో వైద్యుల దగ్గరికి వెళ్లగా రోగ నిర్ధారణ పరీక్షలకు రాశారు. అక్కడ లోపలోనే పరీక్షల కోసం రక్తాన్ని సేకరించి డయాగ్నస్టిక్ కు పంపించారు.
Also read: Bengaluru Students: మాస్టర్ వచ్చారు.. అంతలో ఘర్షణ.. అసలేం జరిగిందంటే?
మరో రెండు పరీక్ష లకోసం డయాగ్నస్టిక్ సెంటర్‌కు నేరుగా వెళ్ళమని తెలిపారు. కానీ అక్కడికి వెళితే ఈ పరీక్షలు ఇక్కడ చేయలేమని వరంగల్‌కు వెళ్లాలని చెప్పారని మహిళ వాపోయింది. ఇలా పరీక్షల కోసం వరంగల్ కు పోవాల్సి రావడంతో తిరిగి ప్రైవేట్ ల్యాబుల్లోనే చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపింది. ఇలా అనేక మంది రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతున్నది.
పరీక్షల కోసం వరంగల్ కు, నర్సంపేటకు తిరగలేక వేసారి పోతున్నారు. రోగులకు అన్ని పరీక్షలు చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంతో వెనక్కి పంపుతుండడంతో సమస్యలు ఎదురవు తున్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దూరంగా ఉన్న వర్ధన్నపేట సిహెచ్సి నుంచి కూడా రక్త నమూనాలు తెచ్చే వాహనాలు కూడా సక్రమంగా రోజువారిగా రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
Also read: Bengaluru Students: మాస్టర్ వచ్చారు.. అంతలో ఘర్షణ.. అసలేం జరిగిందంటే?
వాహనాలకు అద్దె చెల్లింపులో జాప్యంతో వీటిని సరిగా నడపడం లేదని అంటున్నారు. వీటిపై పర్యవేక్షణ కూడా ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న సిబ్బంది కొందరు సొంతంగా వాహనాలను పెట్టుకొని నడిపిస్తుండడంతో సమస్యలు వస్తున్నాయని ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ పై సరిగా పర్యవేక్షణ కూడా పర్యవేక్షణ ఉండడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ హబ్ ను సక్రమంగా పనిచేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోగులకు సక్రమంగా రక్త పరీక్షలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/