SLBC tunnel Collapse Update:
తెలంగాణ

SLBC tunnel Collapse Update: టన్నెల్ లో మరో మృతదేహాం లభ్యం.. ఎక్కడ దొరికిందంటే..

SLBC tunnel Collapse Update: ఎస్ఎల్భీసీ టన్నెల్ లో ఎట్టకేలకు మరో మృతదేహాం లభ్యమైంది. దాదాపు 33 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లభించినది టీబీఎం ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. లోకో ట్రైన్ ట్రాక్  వద్ద మనిషి అవశేషాలను సహాయక బృందాలు గుర్తించాయి. దాంతో ​శిథిలాల కింద తవ్వకాలు చేపట్టాయి. అనంతరం వెలికితీశాయి. ఘటన స్థలం నుంచి మృతదేహాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకి తీసుకువచ్చాయి.

మృతదేహాన్ని ఎన్డీఆర్ ఎఫ్ బృందం, సింగరేణి కార్మికులు కలిసి జాగ్రత్తగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం.. పోస్టుమార్టం నిమిత్తం దాన్ని అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మనోజ్ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.

కాగా, ఫిబ్రవరి 22న నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 33 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన రోజు సొరంగంలో 8 మంది చిక్కుకుపోగా, ఇటీవల ఒక మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం రెస్క్యూ కొనసాగించిన సహాయక బృందాలకు సొరంగంలో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.

Krishna Vamsi: అల్లూరి సమాధి వద్ద.. ఎన్నో ఏళ్ల కల తీరింది

టన్నెల్ లో భారీగా బురద పేరుకుపోవడం, నీరు ఉటలు కడుతుండటంతో రెస్క్యూకి తీవ్ర ఆటంకం కలుగుతోంది. అదీగాక కన్వేయర్ బెల్టు మొరాయిస్తుండటం వంటి పలు సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. చివరికి కడావర్ డాగ్స్ ను రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దింపాయి. అవి సొరంగంలో డీ1, డీ2 ప్రాంతాల్లో మానవ ఆనవాళ్లను కనిపెట్టాయి. దాంతో ఒక మృతదేహాం లభ్యమైంది.

ఇక, ఆ తరువాత వెంటనే రెస్క్యూ సాధ్యమైనంత తొందరగా మృతదేహాల వెలికితీత ప్రక్రియ పూర్తయిపోతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. కడావర్ డాగ్స్ గుర్తించిన డీ1, డీ2 ప్రాంతాల్లో మరో డెడ్ బాడీ ఆనవాళ్లు లభించలేదు. దీంతో రోబోలను కూడా టన్నెల్ లోకి పంపారు. సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. ఈ దశలో నెల రోజులు ముగిసిపోయాయి. అయితే, రెస్క్యూ టీమ్స్ చేతులెత్తేశాయని, ఆపరేషన్ ను ఆపేస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి.

కానీ, అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎస్ఎల్బీసీ ప్రమాదం, సహాయక చర్యలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ పుకార్లకు చెక్ పడింది. అంతేకాదు మరో మృతదేహం లభ్యమమడంతో ఎట్టకేలకు పురోగతి లభించింది. ఇంకో 6 మృతదేహాలు వెలికి తీయాల్సి ఉంది. అనంతరం దీనిపై స్పందించిన నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ కలెక్టర్ బాధావత్ సంతోష్… మృతదేహాన్నిజిల్లా   ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.  డెడ్ బాడీ వెంట రెవిన్యూ, పోలీసు, వైద్య సిబ్బందిని ఉంచినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పజెపుతామని వివరించారు.

అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చనిపోయిన వారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇక, చనిపోయిన వారి మృతదేహాలు వెలికి తీసే వరకు రెస్క్యూను కొనసాగించనున్నట్లు కలెక్టరు వెల్లడించారు.  కాగా, రెస్క్యూ టీమ్స్ ఇదే స్పిరిట్ తో ముందుకు సాగాలని ఆపరేషన్ పూర్తి చేయాలని నెటిజన్లు విషెస్ చెప్తున్నారు.

Also Read: 

AICC – Telangana Cabinet: ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్.. ఉగాదిలోపే కొత్త మంత్రులు!

Young Man Dies By Suicide: బెట్టింగ్ యాప్స్ కు మరో ప్రాణం బలి.. అక్క పెళ్లికి దాచిన డబ్బు పోగొట్టుకొని..

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?