AICC – Telangana Cabinet: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. మంత్రుల పునర్విభజనకు అనుమతిస్తూ ఏఐసీసీ (AICC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 3న నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) రెండో రోజు ఢిల్లీ పర్యటన సందర్భంగా క్యాబినేట్ విస్తరణగా కాంగ్రెస్ అధిష్టానం పచ్చా జెండా ఊపింది. ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఎస్సీకి మంత్రి వర్గంలో చోటు దక్కవచ్చని సమాచారం.
రేసులో ఎవరంటే?
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపే జరగొచ్చని రాజకీయంగా ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాలతో పాటు ఎన్నికల ముందు నేతలకు ఇచ్చిన హామీల ఆధారంగా మంత్రుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. కాగా మంత్రి వర్గ రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. వాకిటి శ్రీహరి, వివేక్ రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, విజయశాంతి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, అమీర్ ఖాన్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.