Narayankhed: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండలం శాంతినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మున్యాతండాలో రోడ్డు (Road) సౌకర్యం లేకపోవడంతో వర్షంలో నానా అవస్థలు పడాల్సి వచ్చింది. తండాకు చెందిన కౌశిబాయికి ప్రసవ వేదన మొదలవడంతో , కుటుంబ సభ్యులు నేడు ఉదయం 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ తండా వరకు రాలేకపోయింది.
Also Read: Jr NTR: సీఎం రేవంత్‌కు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయిన ఎన్టీఆర్.. ఏం చేశాడంటే?
రోడ్డు సౌకర్యాలు లేకపోవడం
ఈఎంటీ సిబ్బంది సంగ్ శెట్టి అక్కడికి చేరుకొని కౌశిబాయికి పురుడు పోశారు. ఆమె ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను ఆస్పత్రికి తరలించేందుకు, వర్షంలోనూ ఈఎంటీ సంగ్ శెట్టి రెండు కిలోమీటర్ల దూరం వరకు బాలింతను వీపుపై మోసుకుని అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటన తండాలో రోడ్డు సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎదురవుతున్న దీనస్థితిని మరోసారి కళ్ళకు కట్టింది.
Also Read: Hyderabad Rains: ప్రజలకు ఎలాంటి కష్టం రానివ్వద్దు.. రౌండ్ ద క్లాక్ అలెర్ట్‌గా ఉండాలి